Young Hero Affair With Old Heroine: ఆమె సీనియర్ హీరోయిన్. ఒకప్పుడు హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన జీవితాన్ని పూర్తిగా నాట్యానికే పరిమితం చేసుకుంది. అన్నింటికి మించి ఏభై ఏళ్ళు దాటుతున్నా ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు. అయితే, గత ఏడాది నుంచి ఆమె నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. మలయాళంలో ఈ మధ్య నాలుగైదు సినిమాల్లో కూడా నటించింది. ఓ తెలుగు సినిమాలో కూడా ప్రస్తుతం నటిస్తోంది. అయితే, ఆమె గురించి తాజాగా షాకింగ్ నిజాలు బయట పడ్డాయి. ఆమె ప్రస్తుతం ఓ కుర్ర హీరోతో ప్రేమలో పడింది.
నిజానికి ఆ హీరోను నమ్ముకొని బాగుపడిన హీరోయిన్లు ఎవ్వరూ లేరు. ఇంకా చెప్పాలంటే అతగాడి ప్రేమలో కొందరు హీరోయిన్లు ఇప్పటికే కెరీర్ ను కూడా నాశనం చేసుకున్నారు. అయితే, వారంటే కుర్ర హీరోయిన్లు కాబట్టి తెలియదు అనుకోవచ్చు. కానీ, ఈమెకు సినిమాల్లో 35 ఏళ్ల అనుభవం ఉంది. పైగా కమల్, రజినీకాంత్, బాలయ్య లాంటి హీరోలతో కలిసి నటించి మెప్పించింది. ఇలాంటి హీరోయిన్ ఒక కుర్ర హీరో మాయలో ఎలా పడింది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు కూడా షాక్ అవుతున్నారు.
Also Read: Liger Collections: లైగర్ 5 డేస్ కలెక్షన్స్.. నష్టాల ప్రళయం.. సంచలన నిర్ణయం తీసుకున్న విజయ్ దేవరకొండ
ఆ హీరో గురించి నిజాలు తెలియని ఈ హీరోయిన్, అతన్ని గుడ్డిగా నమ్ముకుంటోంది. ఈ విషయంలో ఆ హీరోయిన్ ను భ్రమల్లో నెడుతూ, సదరు హీరో పబ్బం గడుపుకుంటున్నాడు. పాపం వయసు ముదిరిపోయాక, ఒంటరి తనాన్ని ఈ సీనియర్ హీరోయిన్ తట్టుకోలేకపోతుంది. అందుకే, ఆమె ఒక తోడు కోరుకుంది. ఈ క్రమంలోనే ఆ తమిళ హీరో తగిలాడు.
ఇతగాడు గతంలో ఓ తెలుగు హీరోయిన్ తో ప్రేమ కహానీలు నడిపాడు. పాపం.. ఆ తెలుగు హీరోయిన్ ఇతగాడి మాయలో పడి కెరీర్ ను నాశనం చేసుకుంది. ఈ మధ్యే రిలీజ్ అయిన నితిన్ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. మొత్తానికి ఈ హీరోయిన్ జీవితాన్ని నాశనం చేసిన ఈ హీరో, ఇప్పుడు 52 ఏళ్ల క్లాసికల్ హీరోయిన్ తో సరసాలు ఆడుతున్నాడు.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. ప్రస్తుతం ఈ హీరోకి హిట్లు లేవు. పైగా ఛాన్స్ లు కూడా గొప్పగా లేవు. ఇలాంటి పరిస్థితులు తనకు ఉన్నాయి కాబట్టే.. అతగాడు తెలివిగా ఆ సీనియర్ హీరోయిన్ ను బుట్టలో వేసుకున్నాడు. ఆమెకు కేరళలో, చెన్నైలో కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ లు ఉన్నాయి. అందుకే, ఇతగాడు ఆ హీరోయిన్ని వదిలిపెట్టడం లేదు. మరి ఈ ముదురు స్వార్థ పేమ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇంతకీ ఆ హీరోయిన్, ఈ హీరో ఎవరో చెప్పగలరా ?, మీ సమాధానాలను కింద కామెంట్ల రూపంలో తెలపండి.
Also Read:Chiranjeevi Movie Effect: చిరంజీవి సినిమా ఎఫెక్ట్.. యముడికి భక్తుడిగా మారిన వ్యక్తి