Salman Khan: ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. పైగా పాన్ ఇండియా సినిమాల హీరోలను మించిన హీరో సల్మాన్ ఖాన్. అసలు సల్మాన్ ఖాన్ చేస్తున్న సినిమాల బడ్జెట్ లెక్క వేస్తే.. రూ.1000 కోట్లకు పైమాటే ఉంటుంది. మరి వేయి కోట్ల హీరో పెళ్లి పై సహజంగానే ఆసక్తి ఉంటుంది. కాగా ఈ ఇంట్రెస్టింగ్ విషయం పై తాజాగా సల్మాన్ ఖాన్ ఒక యాడ్ చేశాడు.
అందుకే, తాజాగా సల్మాన్ ఖాన్ కంపించిన ఈ యాడ్ బాగా వైరల్ అవుతుంది. యాడ్ లో మెయిన్ టాపిక్ సల్మాన్ పెళ్లి కావడంతో దీనికి ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది పెప్సీ కొత్త యాడ్. ఈ యాడ్ లో కంటెంట్ ఏమిటో తెలుసా ?, 30 ఏళ్ల క్రితం నాటి యంగ్ సల్మాన్ ఖాన్, ఇప్పటి సీనియర్ సల్మాన్ ఖాన్‌తో ‘నాకు పెళ్లయిందా భయ్యా’ అని అమాయకంగా మొహం పెడుతూ ఒక ప్రశ్న వేస్తాడు.
ఈ ప్రశ్నకు సీనియర్ సల్మాన్ ఖాన్ కృష్ణపరమమాత్మా లాగా ఒక నవ్వు నవ్వి.. ‘ఊ.. అయ్యింది, నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ’ అంటూ వెటకారంగా అదిరిపోయే జోక్ వేశాడు. ఈ జోక్ ప్రస్తుతం అందర్నీ తెగ ఆకట్టుకుంటుంది. పెప్సీ కొత్త యాడ్‌లోని ఈ సీన్ అండ్ డైలాగ్ ట్రెండీగా ఉండటంతో జనంలోకి బాగా వెళ్ళింది. అందుకే, ఈ యాడ్ కి విపరీతమైన ఆదరణ దక్కుతుంది. ఈ యాడ్ ను డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఈ యాడ్ ను క్రియేట్ చేశారు.
ఇన్నాళ్లు ఈ టెక్నాలజీని మంచి కన్నా చెడుకే ఎక్కువగా ఉపయోగించారు. కానీ, పెప్సీ కంపెనీ మేనేజ్ మెంట్ మాత్రం బాగా వాడుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీని సాధించింది. అన్నట్టు ఈ యాడ్ కి కూడా సల్మాన్ ఖాన్ కి పెప్సీ కంపెనీ 5 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇచ్చింది. సల్మాన్ రియల్ లైఫ్ కి పెర్ ఫెక్ట్ గా సూటయ్యే కంటెంట్ కావడంతో.. సల్మాన్ ఖాన్ కి ఈ యాడ్ కోసం కూడా భారీగానే రెమ్యునరేషన్ ముట్టింది. మరి ఈ యాడ్ పై మీరు కూడా ఒక లుక్కేయండి.
Also Read: Liger Collections: లైగర్ 5 డేస్ కలెక్షన్స్.. నష్టాల ప్రళయం.. సంచలన నిర్ణయం తీసుకున్న విజయ్ దేవరకొండ