Liger Collections: పూరి – విజయ్ దేవరకొండ లైగర్ రిలీజ్ కి ముందు భారీ అంచనాలున్నాయి. అయితే, రిలీజ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు ఆ అంచనాలు తలకిందులు అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. నష్టాల వలయంలో ఈ సినిమా పూర్తిగా చిక్కుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా రిజల్ట్ దెబ్బకు విజయ్ దేవరకొండ షాక్ లోకి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ అయినా వచ్చాయా ? రాలేదా ? చూద్దాం రండి.
ముందుగా ఈ సినిమా 5 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: Chiranjeevi Movie Effect: చిరంజీవి సినిమా ఎఫెక్ట్.. యముడికి భక్తుడిగా మారిన వ్యక్తి
నైజాం 5.56 కోట్లు
సీడెడ్ 1.82 కోట్లు
ఉత్తరాంధ్ర 1.73 కోట్లు
ఈస్ట్ 0.87 కోట్లు
వెస్ట్ 0.58 కోట్లు
గుంటూరు 0.97 కోట్లు
కృష్ణా 0.71 కోట్లు
నెల్లూరు 0.52 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 5 డేస్ కలెక్షన్స్ కు గానూ లైగర్ రూ. 12.77 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 25.54 కోట్లు వచ్చాయి.
తమిళనాడు 0.29 కోట్లు
కేరళ 0.24 కోట్లు
కర్ణాటక 0.89 కోట్లు
హిందీ 6.27 కోట్లు
ఓవర్సీస్ 3.31 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 5 డేస్ కలెక్షన్స్ కు గానూ లైగర్ రూ. 23.78 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 47:56 కోట్లను కొల్లగొట్టింది
లైగర్ చిత్రానికి తెలుగు థియేట్రికల్ బిజినెస్ 55 కోట్లు జరిగింది. కానీ, ఐదు రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం భారీ నష్టాలను చూడబోతుంది. నిజానికి విజయ్ దేవరకొండ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ, ఈ ‘ లైగర్’కి మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. ఈ సినిమాకి 52 కోట్ల వరకు భారీ నష్టాలు రానున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే, పూరితో తాను ప్లాన్ చేసిన మరో సినిమా జనగణమన సినిమాని కూడా ఆపేయాలని విజయ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:VB Rajendra Prasad- Acharya Atreya: ఆత్రేయని మేపలేక కడుపు మండిపోయింది.. దిగ్గజ నిర్మాత సంచలన ఆరోపణలు