Homeక్రీడలుక్రికెట్‌ENG Vs WI T20 World Cup 2026: ఇంగ్లాండ్ పుండు మీద కారం పోశాడు..ఈ...

ENG Vs WI T20 World Cup 2026: ఇంగ్లాండ్ పుండు మీద కారం పోశాడు..ఈ విండీస్ ఆటగాడి మాస్ జాతర మామూలుగా లేదు!

ENG Vs WI T20 World Cup 2026: ఊరందరిది ఒకదారైతే.. ఉలిపి కట్టేది మరొక దారి అంటారు. ఈ సామెత ఈ వెస్టిండీస్ జట్టు ఆటగాడికి నూటికి నూరు శాతం సరిపోతుంది. ఎందుకంటే అతడు మైదానంలో చేసిన ర్యాగింగ్ అటువంటిది. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు బిత్తర పోయారు.

ముంబైలో బుధవారం జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టుపై వెస్టిండీస్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. రూథర్ ఫోర్డ్ (76*) బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. హోల్డర్ (33) కీలక పరుగులు చేశాడు. చేజ్(34) సత్తా చూపించాడు. వెస్టిండీస్ జట్టు ఇన్నింగ్స్ లో బ్యాటర్లు 13 ఫోర్లు కొట్టారు. సిక్సర్లు కూడా అదే స్థాయిలో దంచి కొట్టారు.

ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు 19 ఓవర్లలో 166 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. సాల్ట్(30), బెతల్ (33), సామ్ కరణ్ (43*) పరుగులు చేశారు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 19 ఓవర్లలో 166 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత వెస్టిండీస్ జట్టు ప్లేయర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత వెస్టిండీస్ జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇందులో పావెల్ మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ ప్లేయర్లు రషీద్, కరణ్ వద్దకు వెళ్లి కావాలని షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడాడు. మాట్లాడుతున్నంత సేపు ఆటిట్యూడ్ చూపించాడు. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అందరు ప్లేయర్లు ఒక విధంగా ఉంటే.. పావెల్ మరొక విధంగా వ్యవహరిస్తున్నాడని.. ఇది వెస్టిండీస్ జట్టు ఒకప్పటి పొగరును సూచిస్తోందని క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పావెల్ 14 పరుగులు చేశాడు. 13 బంతులు ఎదుర్కొన్న అతడు రెండు ఫోర్ ల సహాయంతో 14 పరుగులు చేశాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో ఓవర్టన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గొప్ప ఇన్నింగ్స్ ఆడ లేకపోయినప్పటికీ మైదానంలో తన ఆటిట్యూడ్ చూపించి.. వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు పావెల్.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version