Speed Guns: రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని ప్రమాద సూచికలు చెబుతుంటాయి. అయినా కొన్ని కారణాల వల్ల చాలా మంది స్పీడ్ గా వెళ్తుంటారు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్పీడ్ గన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ స్పీడ్ గన్స్ ద్వారా అతి వేగంగా వెళ్లే వాహనాలకు జరిమానా విధిస్తారు. హైవే పై వెళ్లేటప్పుడు ఒక్కోసారి తెలియకుండా స్పీడ్ గా వెళ్తుంటారు. దీంతో ఒక్కోసారి అనవసరంగా ఫైన్ కు గురయ్యమా? అని ఫీలవుతుంటారు. అయితే ఈ ఫైన్ నుంచి తప్పించుకోవడానికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ మ్యాప్ లో ఈ ట్రిక్ ద్వారా ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు. అదెలాగో చూడండి..
ప్రధాన రహదారులపై వాహనాలు వెళ్లేటప్పుడు స్పీడ్ లిమిట్ దాటుతూ ఉంటుంది. కానీ ఎంత స్పీడులో వెళ్తున్నారో తెలియదు. అయితే స్పీడ్ గా వెళ్లే వాహనాలను స్పీడ్ గన్ రాగానే ఒక్కసారిగా తగ్గింపు చేయడం కుదరదు. ముందే అలర్ట్ చేసిన చెబితే ఆ స్పీడ్ గన్ వద్ద స్లోగా వెళ్లొచ్చు. దీంతో ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు. ఇందు కోసం ప్రత్యేకంగా స్పీడ్ మీటర్ ను ప్రత్యేకంగా చూడనవసరం లేదు. మొబైల్ లో చిన్న అలారం పెట్టుకుంటే చాలు. అదీ గూగుల్ మ్యాప్ ద్వారా సెట్ చేసుకోవాలి.
వాహనాన్ని నడిపేటప్పుడు గూగూల్ మ్యాప్స్ ద్వారా రూట్లను తెలుసుకుంటూ ఉంటారు. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడానికి గూగుల్ మ్యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే స్పీడ్ గన్ నుంచి తప్పించుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇందులో ఒక సెట్టింగ్స్ ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా స్పీడ్ గన్ వచ్చే ముందు అలారం వస్తుంది. అంటే పరిమితికి మించి స్పీడ్ గా వెళ్తుంటే అలారం వస్తుంది. దీంతో స్పీడ్ గన్ రాగానే స్లోగా డ్రైవ్ చేసుకోవచ్చు. అయితే దీనిని ఎలాగ ఎనేబుల్ చేసుకోవచ్చో తెలుసుకుందాం..
ముందుగా గూగుల్ యాప్స్ లోకి వెళ్లి ‘సెట్టింగ్స్’ ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత కిందకు వచ్చి ‘నావిగేషన్ సెట్టింగ్’ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత ‘డ్రైవింగ్ ఆప్సన్’ ను ఎంచుకుంటే అందులో వివిధ ఫీచర్లు కనిపిస్తాయి. ఇప్పుడు ‘స్పీడ్ మీటర్’ అనే ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకుంటే వాహనం ఎంత వేగంలో వెళ్తుందో తెలిసిపోతుంది. అయితే స్పీడ్ గన్ మీటర్ పరిమితిని సెలెక్ట్ చేసుకొని పరిమితి దాటగానే అలారం వచ్చేలా సెట్ చేసుకోవాలి. అలా అలారం రాగానే స్పీడ్ స్లోగా వెళ్లి ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు.