Walthair Veeraiya : రేటింగ్స్ తో ‘వాల్తేరు వీరయ్య’ ప్రభంజనాన్ని ఆపలేకపోయిన పచ్చ మీడియా

Walthair Veeraiya : ఒక వర్గానికి మెగాస్టార్ చిరంజీవి అంటే దశాబ్దాల నుండి పడని విషయం మన అందరికీ తెలిసిందే..ఆ వర్గం ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..మెగాస్టార్ చిరంజీవి మీద విషం చిమ్మడానికి ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తూ ఉంటారు..తమ వర్గానికి ఉన్న మీడియా బలం తో చిరంజీవి మరియు అతని కుటుంబ సభ్యులపై చేసిన విష ప్రచారాలు ఎప్పటికి ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. స్వయంకృషి తో ఎలాంటి అండదండా లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి మూడు […]

Written By: NARESH, Updated On : January 13, 2023 11:02 pm
Follow us on

Walthair Veeraiya : ఒక వర్గానికి మెగాస్టార్ చిరంజీవి అంటే దశాబ్దాల నుండి పడని విషయం మన అందరికీ తెలిసిందే..ఆ వర్గం ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..మెగాస్టార్ చిరంజీవి మీద విషం చిమ్మడానికి ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తూ ఉంటారు..తమ వర్గానికి ఉన్న మీడియా బలం తో చిరంజీవి మరియు అతని కుటుంబ సభ్యులపై చేసిన విష ప్రచారాలు ఎప్పటికి ఎవ్వరూ కూడా మర్చిపోలేరు.

స్వయంకృషి తో ఎలాంటి అండదండా లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో నెంబర్ 1 హీరో గా కొనసాగిన మెగాస్టార్ అంటే అసూయ తో ఎప్పుడూ రగిలిపోతూనే ఉంటుంది ఆ వర్గం..ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోరు..మీడియా మొత్తం వాళ్లదే కాబట్టి, వాళ్ళు చెప్పింది మరియు చూపించిందే ప్రజలు కూడా నమ్మేవాళ్ళు..ఉదాహరణకి ఈరోజు విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ని తీసుకుందాం..ఈ సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు ‘వీర సింహా రెడ్డి’ సినిమా విడుదలైంది.

తమ అభిమాన హీరో సినిమా విడుదలైంది..ఇంకా ఎవ్వరూ అడ్డురాకూడదు..ముఖ్యంగా చిరంజీవి సినిమాని దెబ్బ తియ్యాలనే లక్ష్యం తో తెల్లవారు జామున పూర్ రేటింగ్స్ తో ‘వాల్తేరు వీరయ్య’ ని తీవ్రంగా దెబ్బతీసే పని చేసారు..ఒక్కటంటే ఒక్క వెబ్ సైట్ కూడా 3 స్టార్ రేటింగ్ ఇవ్వలేదు..కనీసం 2.5 స్టార్ రేటింగ్ కూడా ఇవ్వలేదు..2 , 2.25 రేంజ్ రేటింగ్స్ ఇచ్చి ఆడియన్స్ మూడ్ డైవర్ట్ చేయించే వికృత వేషాలు వేశారు..ఈ సినిమాని చూసిన ఎవరికైనా ‘బాగానే ఉంది కదా..ఎందుకు అంత తక్కువ రేటింగ్ ఇచ్చారు’ అనే సందేహం రాక తప్పదు..అయితే అరచేతితో సూర్యుడిని ఆపలేము అనే సామెత ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ఓపెనింగ్స్ కి సరిగ్గా సరిపోతుంది..ఎంత బ్యాడ్ రేటింగ్స్ మరియు రివ్యూస్ ఇచ్చి ఈ సినిమాని దెబ్బ తియ్యాలనే ప్రయత్నం చేసినా వసూళ్ల సునామి కి ఇసుమంత ఎఫెక్ట్ కూడా పడలేదు.

మొదటి ఆట నుండి చివరి ఆట వరకు మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి..బీ ,సి సెంటర్స్ లో థియేటర్స్ కెపాసిటీ కి సీట్స్ సరిపోగా అదనపు కుర్చీలను తెప్పించిన సందర్భాలు ఈరోజు చాలా ప్రాంతాలలో జరిగాయి..ఇక రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదటి రోజుని తలపించే రేంజ్ లో ఉన్నాయి..ఈ జనప్రవాహం చూస్తూ ఉంటే ఈ నెల మొత్తం బాక్స్ ఆఫీస్ ప్రభంజనం కొనసాగేటట్టు ఉంది..మరి మూవీ రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.