
Zodiac Sign: మన తెలుగు వారికి పంచాంగమే అన్నింటికి మూలం. ఏ పని చేయాలన్నా పంచాంగం చూడాల్సిందే. ఏ చిన్న మంచి పని మొదలు పెట్టాలన్నా పంచాంగం చూడాల్సిందే. మన జాతకం ఎలా ఉందో తెలుసుకోవాల్సిందే. పంచాంగంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఉంటాయి. వారి రాశి, నక్షత్రం ప్రకారం వారు ఏ పని చేయాలన్నా ముహూర్తం చూసుకోవాల్సిందే. మంచి రోజు చూసుకుని ముహూర్తం ఎంచుకుని పని ప్రారంభిస్తాం. చేపట్టిన పని నిర్విఘ్నంగా సాగేందుకు తగిన విధంగా పద్ధతులు పాటిస్తుంటాం. ఇలా పంచాంగం మన జీవితంతో ముడిపడిపోయింది.
పంచాంగంలో ద్వాదశ రాశులు ఉంటాయి. అంటే 12 రాశులు అన్నమాట. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ప్రతి వారికి ఏదో ఒక రాశి వర్తిస్తుంది. వారి పేరులోని మొదటి అక్షరం ఆధారంగా వారి రాశిని నిర్ణయిస్తారు. ఇక మనం పుట్టే సమయం తేదీ ఆధారంగా నక్షత్రం వస్తుంది. ఇలా మన జాతకంలో నక్షత్రం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఉగాది వచ్చింది. దీంతో పన్నెండు రాశుల వారికి పరిహారాలు కూడా చెబుతున్నారు. ఏ రాశి వారు ఏ విధంగా తమ ఇష్టదైవాన్ని పూజిస్తే మంచి జరుగుతుందో సూచిస్తున్నారు.

మేష రాశి వారు తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారం కుమారస్వామిని పూజిస్తే బాధలు ఉండవు. వృషభ రాశి వారు తమలపాకులో మిరియాలు పెట్టి మంగళవారం రాహువును ప్రార్థిస్తే శుభ ఫలితాలు వస్తాయి. మిథున రాశి వారు తాంబూలంలో అరటిపండును ఉంచి బుధవారం తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే బాధలు తొలుతాయి. కర్కాటక రాశి వారు తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం కాళీమాతను పూజిస్తే మంచిది. సింహ రాశివారు తాంబూలంలో అరటిపండును ఉంచి తమ ఇష్టదైవాన్ని పూజించాలి.
కన్యా రాశి వారు తమలపాకులో మిరియాలు పెట్టి గురువారం తమ ఇష్ట దైవాన్ని కొలిస్తే మంచిది. తుల రాశి వారు తాంబూలంలో లవంగం ఉంచి తమ కుల దైవాన్ని కొలవటం శుభాలను కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారు తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం తమ ఇష్ట దైవాన్ని పూజిస్తే ఈతిబాధతు తొలగిపోతాయి. ధనుస్సు రాశి వారు తాంబూలంలో కలకండను ఉంచి గురువారం ఇష్టదైవాన్ని కొలిస్తే మంచిది. మకర రాశి వారు తమలపాకులో బెల్లం పెట్టి కాళీమాతను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. కుంభ రాశి వారు తాంబూలంలో నెయ్యి ఉంచి శనివారం కాళీమాతను పూజించాలి. మీన రాశి వారు తమలపాకులో పంచదార ఉంచి ఆదివారం ఇష్ట దేవతను పూజించడం వల్ల శుభాలు కలుగుతాయి. తాంబూలాన్ని ఒక ముత్తయిదువకు బొట్టు పెట్టి ఇస్తే మంచిది.