Samantha Disease: మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా యశోద మూవీ ప్రమోషన్స్ లో సమంత పాల్గొన్నారు. కాగా సమంత తన ఆరోగ్యం గురించి ప్రకటన చేసినప్పటి నుండి అభిమానుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. సమంతకు సోకిన మయోసైటిస్ ప్రాణాంతకమా. అసలు ఏ స్టేజిలో ఉంది. సమంత పరిస్థితి ఏమిటీ? ఆమె అసలు కోలుకుంటారా లేదా? ఇలా అనేక ప్రశ్నలు మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఈ ప్రశ్నలకు, సందేహాలకు సమంత స్వయంగా సమాధానాలు చెప్పారు. తన పరిస్థితి తెలియజేస్తూ సమంత ఎమోషనల్ అయ్యారు.

జీవితంలో మంచి రోజులు ఉంటాయి చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కోసారి ఒక అడుగు కూడా ముందుకు వేయలేం అనిపిస్తుంది. మరోసారి మనం ఇంత దూరం ప్రయాణం చేశామా? ఈ స్థాయికి చేరామా అనిపిస్తుంది. జీవితంలో ఇది కఠినమైన సమయం. దీన్ని ఎదిరించి నిలబడాలి. నేనే కాదు నాలాగా చాలా మంది భయంకరమైన రుగ్మతలతో పోరాడుతున్నారు. నేను దీన్ని గెలవగలను. గెలిచి తిరిగిరాగలనన్న ధైర్యం ఉంది.
కొన్ని వార్తలు నేను చదివాను. అసలు నేనేదో చనిపోతున్నట్లు రాశారు. అంత దారుణమైన పరిస్థితి లేదు. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను. నేను బ్రతికే ఉన్నాను. అయితే మీడియాలో రాసినంత దారుణంగా అయితే లేను. నేను కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్న మాట నిజమే. భవిష్యత్ ఏమిటో తెలియదు కానీ ప్రజెంట్ నేను ఓకే. మీడియాలో రాసినట్లు నేను చనిపోలేదు, అని నవ్వుతూ సమాధానం చెప్పారు సమంత. తనకు సోకిన మయోసైటిస్ ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ నేను చికిత్స తీసుకుంటున్నాను. పోరాడుతున్నానని సమంత చెప్పుకొచ్చారు

తాను చనిపోవాలని కొందరు కోరుకున్నారని సమంత చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే యశోద చిత్రం గురించి సమంత ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యశోద నా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుంది అన్నారు. యశోద కూడా పెద్ద పెద్ద కలలు కనే ఇక మామూలు అమ్మాయి. నా జీవితం కూడా అలానే మొదలైంది. యశోద సినిమా కథ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందన్నారు. యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రతి అంశం ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది అన్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ కూడా సమంత మూవీ ప్రమోషన్స్ లో పాల్గొని నిర్మాతల పట్ల తన బాధ్యత చాటుకుంది. యశోద నవంబర్ 11న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.