
WPL 2023 Mumbai vs RCB: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబాయి జట్టు విజయపరంపర కొనసాగుతోంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో ఎదురన్నదే లేకుండా దూసుకుపోతోంది. ముంబాయిలో సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై జరిగిన మ్యాచ్‌లో సునాయాసంగా విజయం సాధించింది. తొమ్మిది వికెట్ల తేడాతో స్మృతి టీంను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకు కుప్పకూలింది. బెంగళూరు బ్యాటర్లలో రిచా(28), కనిక(22), మేఘన్(20) మాత్రమే రాణించారు. ముంబై బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్(3/28) మూడు వికెట్లు తీసింది. సైకా ఇషాక్(2/26) రెండు వికెట్లు తీసింది. అమేలియా కెర్(2/30), పుజా వస్త్రాకర్ ఒక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబాయి జట్టు 14.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 159 పరుగులు చేసి సునాయాజ విజయాన్ని అందుకుంది. మ్యాథ్యూస్(13 ఫోర్లు, ఒక సిక్సర్ 77 నాట్ ఔట్), సిఫర్ బ్రంట్(29 బంతుల్లో 9 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 55 పరుగులు నాట్ ఔట్) ఆజేయ హాఫ్ సెంచరీ సాధించారు. ఆర్‌సీబీ బౌలర్లలో ప్రీతి బోస్ ఒక వికెట్ తీసింది. మిగతా బౌలర్లు తేలిపోయారు. మ్యాథ్యూస్ ఆల్ రౌండ్ షో చేసి ముంబాయి జట్టును గెలిపించింది.

156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబాయి జట్టు ఓపెనర్లు మ్యాథ్యూస్, భాటియా(23) శుభారంభం అందించారు. మొదటి నుంచి ఆర్‌సీబీ బౌలర్ల పై ఎదురుదాడికి దిగిన ముంబాయి బ్యాటర్లు తొలి వికెట్‌కు 45 పరుగులు సాధించారు. ప్రీతి బోస్ బౌలింగ్‌లో భాటియా ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నాట్ సివర్, మ్యాథ్యూస్ జోడి చెలరేగిపోయింది. పవర్ ప్లేలో 54 పరుగులు చేసింది. అనంతరం మ్యాథ్యూస్ చెలరేగి ఆడింది బెంగళూరుపై బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన మ్యాథ్యూస్ డబ్ల్యూపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ చేసింది. మరో వైపు సీవర్ బ్రంట్ కూడా ధాటిగా ఆడింది. ముఖ్యంగా శ్రేయాంక పాటిల్ వేసిన 13వ ఓవర్‌లో వరుసగా ఫోర్, సిక్స్, మ్యాథ్యూ బౌండరీ బాదింది. ఈ ఒక్క ఓవర్‌లో ముంబాయి 20 పరుగులు సాధించింది. ఆ తర్వాత సీవర్ ఓ బౌండరీ సాధించి ముంబాయి విజయాన్ని లాంఛనంగా పూర్తి చేసింది.