
Ravanasura Teaser: రవితేజ సినిమాలు అంటే ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.ఆయన సినిమా వచ్చిందంటే చాలు మాస్ సెంటర్స్ మాస్ ఆడియన్స్ తో కిక్కిరిసిపోయాయి.ఆయన మార్కు కామెడీ టైమింగ్ తో పాటుగా,డైరెక్టర్స్ ఆయనని మాస్ గా చూపించే విధానం, ఆయన చేత పలికించే డైలాగ్స్ థియేటర్స్ లో అభిమానులకు మెంటలెక్కిపోయేలా చేస్తుంది.
ఇక రీసెంట్ గానే ఆయన ‘ధమాకా’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్నాడు.ఈ రెండు సినిమాల తర్వాత ఆయన చేసిన మరో చిత్రం ‘రావణాసుర’.ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఈరోజు విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.రవితేజ నుండి మరో బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుంది అనే సంకేతాలను ఇచ్చింది.అయితే అదే సమయం లో ఈ టీజర్ వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారిపోయింది.
ఎందుకు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యిందంటే ఈ టీజర్ లో రవితేజ ‘సీత దగ్గరకి వెళ్లాలంటే..ముందు ఈ రావణాసురుడిని దాటాలి రా’ అంటూ చెప్పే డైలాగ్ ఇప్పుడు విమర్శకుల నుండి తీవ్రమైన వ్యక్తిరేకత ఎదురైంది.నెగటివ్ షేడ్స్ తో ఉన్న హీరో రోల్ ఎలివేట్ చెయ్యడం కోసం సీత లాంటి మహాపతీవ్రత పేరు తీసి ఆమెని తగ్గిస్తారా అంటూ సోషల్ మీడియా నెటిజెన్స్ పెదవి విరుస్తున్నారు.

ఇలాంటి డైలాగ్స్ డైరెక్టర్ పెడుతున్నప్పుడు వద్దు అని చెప్పే ఇంకిత జ్ఞానం కూడా రవితేజ కి లేకుండా పోయిందా అని విరుచుకుపడుతున్నారు.ఇది వరకు ఎన్నో సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ వచ్చాయి, కానీ కేవలం మీరు రవితేజ ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆయన అభిమానులు ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్ పై విరుచుకుపడుతూన్నారు.మరి దీనిపై మూవీ టీం రియాక్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి.