Work From Traffic: ఆఫీస్ మీటింగ్ ‘ట్రాఫిక్’లోనే.. మా తల్లే.. బెంగళూరులో ఎంత కష్టమొచ్చింది

ట్రాఫిక్ అనగానే ముందుగా బెంగళూరు నగరం గుర్తుకు వస్తుంది. సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన ఈ బెంగళూరు నగరం ఎన్నో ఐటీ కంపెనీలకు నిలయంగా మారింది. ఇక దేశంలోని నలుమూలల నుంచి ఉద్యోగులు ఇక్కడికి ఉద్యోగం కోసం వస్తుంటారు.

Written By: Swathi, Updated On : April 27, 2024 12:37 pm

Work From Traffic

Follow us on

Work From Traffic: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు ప్రజలు. ఒక్క రోజు కాదు ప్రతి రోజు ఇదే పని. ఇక ఇంట్లో నుంచి ఉద్యోగానికి వెళ్లాలంటే ఫుల్ ట్రాఫిక్ తో ఇబ్బంది పడాల్సిందే. మరి మీరు కూడా ఇదే విధంగా ఇబ్బంది పడుతున్నారా? కొందరు ఈ ట్రాఫిక్ కు గురి కావాల్సిందే. ఇప్పుడు మీరు చూడబోయే ఒక అమ్మాయి వీడియో మిమ్మల్ని షాక్ కు గురి చేస్తుంది. లైఫ్ ఎంత బిజీగా మారిందో అర్థం అయ్యేలా చేస్తుంది. మరి ఓ సారి ఆ వీడియో వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

ట్రాఫిక్ అనగానే ముందుగా బెంగళూరు నగరం గుర్తుకు వస్తుంది. సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన ఈ బెంగళూరు నగరం ఎన్నో ఐటీ కంపెనీలకు నిలయంగా మారింది. ఇక దేశంలోని నలుమూలల నుంచి ఉద్యోగులు ఇక్కడికి ఉద్యోగం కోసం వస్తుంటారు. అందుకే బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అదే రేంజ్ లో చిత్ర హింసలు ఉంటాయి. ఒకసారి బండి ఆగిందంటే చాలు గంటల తరబడి ట్రాఫిక్ లోనే గడపాల్సిందే. ముఖ్యంగా ఉద్యోగులు ఆఫీస్ కు వెళ్లాలంటే ఫుల్ టెన్షన్ అవ్వాల్సిందే.

అచ్చం అలాంటి విషయం ఓ వీడియో అర్థం అయ్యేలా చెబుతుంది. ఓ మహిళా ఉద్యోగి ఆఫీస్ కు బయలుదేరింది. అంతలోనే ఆఫీస్ మీటింగ్ కు హాజరు కావాల్సి వచ్చింది. ఇక ట్రాఫిక్ లో ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక జూమ్ మీటింగ్ లో ట్రాఫింగ్ లోనే హాజరు అయింది ఆ మహిళ. దీంతో చాలా మంది వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బెంగళూరులో ఓ సాధారణ రోజు అంటూ ఆవేదన చెందుతున్నారు. ఇంకేముందు ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బెంగళూరులో ఇది చాలా కామన్ గురు అంటున్నారు. మరి ఈ ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడు నిరవేరుతాయో చూడాలి.