మహిళా దొంగను పట్టించిన వాట్సాప్ స్టేటస్.. ఎలా అంటే..?

స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా ఉపయోగించే యాప్ లలో ఒకటైన వాట్సాప్ యాప్ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. వాట్సాప్ యాప్ లోని స్టేటస్ ఫీచర్ ద్వారా ఫోటోలు, వీడియోలను పెట్టడంతో పాటు మన మనస్సులోని భావాలను సులభంగా వ్యక్తం చేయవచ్చు. అయితే ఆ వాట్సాప్ స్టేటస్ ఒక మహిళా దొంగను పట్టించింది. దొంగతనం చేసిన మహిళ చేసిన చిన్న తప్పు వల్ల పోలీసులకు సులభంగా దొరికిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలోని ప్రైమ్ […]

Written By: Kusuma Aggunna, Updated On : December 27, 2020 9:31 am
Follow us on


స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా ఉపయోగించే యాప్ లలో ఒకటైన వాట్సాప్ యాప్ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. వాట్సాప్ యాప్ లోని స్టేటస్ ఫీచర్ ద్వారా ఫోటోలు, వీడియోలను పెట్టడంతో పాటు మన మనస్సులోని భావాలను సులభంగా వ్యక్తం చేయవచ్చు. అయితే ఆ వాట్సాప్ స్టేటస్ ఒక మహిళా దొంగను పట్టించింది. దొంగతనం చేసిన మహిళ చేసిన చిన్న తప్పు వల్ల పోలీసులకు సులభంగా దొరికిపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలోని ప్రైమ్ గెలాక్సీ అపార్టుమెంట్ లో కత్తి అమోగ్ దంపతులు గత కొన్నేళ్లుగా జీవిస్తున్నారు. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన తరువాత అమోగ్ సెలవులు ఎక్కువ రోజులు ఉండటంతో కర్ణాటక రాష్ట్రంలోని తల్లిదండ్రులను చూడటానికి కుటుంబ సభ్యులతో వెళ్లాడు. దాదాపు నాలుగు నెలలు కర్ణాటకలోనే ఉండి అక్టోబర్ 29వ తేదీన అమోగ్, అతని కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు.

అయితే ఇంట్లో వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉండటం, ఇంట్లో విలువైన వస్తువులు, నగలు, చీరలు మాయం కావడంతో అమోగ్, అతని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఆ తరువాత అమోగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అమోగ్ సైతం ఆ వస్తువులపై ఆశలు వదిలేసుకున్నాడు. అయితే ఒకరోజు వాట్సాప్ స్టేటస్ లో అమోగ్ తన ఇంట్లో చోరీ అయిన చీరను గతంలో పని చేసేన పనిమనిషి ధరించినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఆ విషయం తెలిపి వాట్సాప్ స్టేటస్ ను సాక్ష్యంగా చూపించాడు.

పోలీసులు విచారణ చేపట్టి పని మనిషి సామన సునీతను అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గరి నుంచి నాలుగున్నర తులాల బంగారాన్ని, విలువైన చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టేటస్ ద్వారా దొరికిపోయిన సదరు మహిళ గురించి నెట్టింట వైరల్ అవుతోంది.