Online Dating APP: దేశంలో మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా గుడ్డిగా నమ్ముతున్నారు. ఫలితంగా మోసాలకు గురవుతున్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావంతో అమ్మాయిలు గుడ్డిగా నమ్ముతూ ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూ కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ , ట్విటర్లు ఉపయోగిస్తూ బాధలకు గురవుతున్నారు. ఎన్నో మోసాలు జరుగుతున్నా తేరుకోవడం లేవు. ఫలితంగా జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు.

పుణేకు చెందిన ఓ యువతి ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. తానో సాఫ్ట్ వేర్ ఉద్యోగినని నమ్మించాడు. వేసవి వెకేషన్ కోసం మాల్దీవులకు వెళదామని నమ్మించాడు. ఇద్దరు కలిసి అక్కడకు చేరుకున్నారు. ఓ హోటల్ లో బస చేశారు. కలిసి తిరిగారు. ఆమె దగ్గర ఉన్న యాభై వేలు తీసుకున్నాడు. హోటల్ లో అసభ్యంగా ప్రవర్తించాడు. ముద్దులు పెడుతూ తనతో గడపాలని ఒత్తిడి తెస్తున్నాడు. దీంతో విసిగిపోయిన ఆమె స్వగ్రామానికి చేరింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: AP Debt Burden: ఏపీ ప్రభుత్వ అప్పులపై క్లారిటీ.. కేంద్రం కన్నెర్ర
మరో ఘటనలో ఉత్తర ప్రదేశ్ లోని కాస్ గంజ్ జిల్లాలో 16 ఏళ్ల బాలిక బంధువుల ఇంటికి వచ్చింది. దీంతో ఓ కానిస్టేబుల్ ఆమెపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి తన బైక్ మీద ఎక్కించుకుని పక్క గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడి చేశారు. విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. బాలిక భయంతో ఇంటికి చేరుకుని జరిగిన దారుణాన్ని చెప్పడంతో కానిస్టేబుల్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని సస్పెండ్ చేశారు. సంఘటనపై విచారణ ప్రారంభించారు.

ఇలా నమ్మిన వారిని నట్టేట ముంచుతూ నయవంచకులుగా మారుతున్న ఉదంతాలు కోకొల్లలు. ఆడవారికి ఆత్మరక్షణ లేకుండా పోతోంది. ఫలితంగా వారిపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.