సాధారణంగా ఎవరైనా జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి తరువాత దంపతుల మధ్య విభేదాలు ఉన్నా, తరచూ గొడవలు పడుతున్నా కోర్టులను ఆశ్రయించి విడాకులు తీసుకుంటారు. అయితే ఒక మహిళ మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది పెళ్లిళ్లు చేసుకుంది. సదరు మహిళ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. ప్రపంచంలో ఇలాంటి మహిళలు కూడా ఉన్నారా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
బట్టలు మార్చినంత సులభంగా ఆ అమహిళ భర్తలను మారుస్తోందంటూ అభిప్రాయపడుతున్నారు. పది పెళ్లిళ్లు చేసుకున్న ఆ మహిళ భవిష్యత్తులో ఆ మరో పెళ్లి కూడా చేసుకోవడానికి తాను సిద్ధమేనంటూ కీలక ప్రకటన చేసింది. అయితే ఆ మహిళ అంతమందిని పెళ్లి చేసుకోవడం వెనుక విచిత్రమైన కారణాలు ఉన్నాయి. అమెరికాలో కాస్సే అనే మహిళ నివశిస్తోంది. ఇప్పటివరకు 10 సార్లు పెళ్లి చేసుకున్న ఆ మహిళ ప్రతి ఒక్కరితో ఏదో ఒక కారణం వల్ల విడిపోయింది.
ఒక భర్తతో మాత్రం ఆమె ఎనిమిది సంవత్సరాలు కాపురం చేయగా మిగిలిన భర్తలతో మాత్రం కొన్ని నెలలు కాపురం చేసిన తరువాత విడిపోయింది. ప్రస్తుతం కాస్సీ వయస్సు 56 సంవత్సరాలు. డాక్టర్ పిల్ అనే వ్యక్తి కాస్సీను ఇంటర్వ్యూ చేయగా తనకు భాద, సంతోషం లాంటి భావనలు ఉండవని.. తనకు మనస్సు ఒప్పుకోకపోతే విడాకులు తీసుకుంటానని వెల్లడించారు.
రెండో భర్తతో మాత్రం ఎనిమిదేళ్లు కాపురం చేయగా వీళ్లు ఒక మగపిల్లాడిని కన్నారు. తాను చివరి భర్తతో మానసికంగా తృప్తి పొందలేకపోవడం వల్లే విడిపోయానని కాస్సే చెబుతోంది. చిన్నచిన్న కారణాలకే భర్తలను తరచూ మారుస్తున్న ఈమె గురించి సోషల్ మీడియాలో అవుతోంది.