
Woman journalist: ఆమె బాధ్యతాయుతమైన జర్నలిస్టు. సమాజాన్ని వేధిస్తున్న సమస్యలు, సమాజ రుగ్మతలపై స్పందించడం ఆమె విధి. ఈ తరుణంలో ఆమె ఎన్నోసవాళ్లను, సమస్యలను, అపాయాలను ఎదుర్కొంటూ వస్తోంది. కానీ ప్రత్యర్థులు ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. ఆమెపై వేశ్య అనే ముద్ర వేశారు. ఆన్ లైన్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రకటనలు చూసిన వారంతా ఆమె ఇంటి డోర్ కొడుతున్నారు. ఏంకావాలి అన్నంతలోపే మీరు వేశ్యకదా? ఆన్ లైన్ లో ప్రకటన చూశామని చెబుతుండడంతో ఆమె మైండ్ బ్లాక్ అవుతోంది. మీ రేటు ఇంత అట అని అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక కన్నీటిపర్యంతమవుతోంది. రోజురోజుకూ ఈ వేధింపులు అధికం కావడంతో చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
ఎందుకు టార్గెట్ చేశారంటే?
సూయుటాంగ్ అనే మహిళా పాత్రికేయురాలిది చైనా. ప్రస్తుతం ఆమె జర్మనీలో నివాసముంటున్నారు. 1989లోని బీజింగ్ లోని తియాన్మిన్ స్క్వేర్ లో విద్యార్థులు పెద్దఎత్తున ఉద్యమించారు. దీనికి చైనా ప్రభుత్వం క్రూరంగా అణచివేసింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ప్రజాస్వామ్యవాదులు నిరసన తెలిపారు. జర్మనిలో జరిగిన నిరసన ప్రదర్శనలో సూయుటాంగ్ కూడా పాల్గొన్నారు. చైనా ఏజెంట్లకు టార్గెట్ గా మారారు. చైనా అసమ్మతివాదులు ఎక్కడ ఉంటే అక్కడ వారిని హింసించి పైశాచిక ఆనందం పొందడం వీరి హాబీ. కానీ వీరెక్కడా నేరుగా కనిపించారు. చైనాకు వ్యతిరేకంగా ఉన్నవారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి.. వారిని సమాజంలో అప్రతిష్టపాలు చేసేందుకు వెనుకాడరు.

ఇలా దెబ్బతీశారు..
సూయుటాంగ్ చిత్రాలను మార్ఫింగ్ చేశారు. కాల్ గర్ల్ గా చిత్రీకరించారు. ఎస్కార్ట్ సేవలు అందిస్తున్నట్టు చెప్పి ఆమె ఫోన్ నంబర్లను జతచేశారు. అడ్రస్ ను పొందుపరిచారు. అక్కడితో ఆగకుండా వెబ్ సైట్ లో రేట్లను సైతం ఫిక్స్ చేశారు. దీంతో ఆమె ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. మెసేజ్ లు పంపుతున్నారు. ఈ వేధింపులు తాళలేక ఆమె సోషల్ మీడియా ఖాతాలన్నీ మూసివేశారు. దీంతో నేరుగా ఇంటికి వచ్చి డోర్ కొడుతున్నారు. ఎందుకు వచ్చారంటే మీరు వేశ్య కదా.. అన్నిరకాల సేవలందిస్తారా? అంటూ అడుగుతున్నారు. ఇటీవల అటువంటి వేధింపులు తీవ్రం కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఆమె వ్యతిరేక కథనాలను చైనా మీడియా ప్రముఖంగా ప్రచారం చేస్తోంది. దీంతో ఇది చైనా ఏజెంట్ల పనియేనని నిర్థారణ అయ్యింది. దీనిపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తానని లేడీ జర్నలిస్టు సూయుటాంగ్ చెబుతున్నారు.