Drinking Water : షాకింగ్.. ఎక్కువ నీళ్లు తాగి మహిళ మృతి.. ఎందుకలా జరిగిందంటే?

చివరకు అధిక మోతాదులో నీళ్లు తాగి మృతి చెందినట్లు నిర్ధారించారు. అధిక విషపూరితమైన నీరు సేవించడం వల్లే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు.

Written By: NARESH, Updated On : August 4, 2023 8:53 pm
Follow us on

Drinking Water : నీళ్లు ఎక్కువగా తాగడం వలన వ్యాధులు దరిచేరవని వైద్యులు చెబుతుంటారు. రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగాలని సూచిస్తుంటారు. నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా డైజేషన్‌ సిస్టం మెరుగుపడుతుందని, కిడ్నీలు, లివర్‌ శుభ్రమవుతాయని పేర్కొంటారు. రక్తం శుద్ధి అవుతుందని చెబుతారు. ఇవి నిజమే.. కానీ ఇక్కడ ఓ మహిళ ఎక్కువగా నిళ్లు తాగి కుప్పకూలింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఎందుకలా జరిగిందంటే..

20 నిమిషాల్లో 2 లీటర్లు తాగి..
ఎక్కువగా మంచి నీళ్లు తాగి అక్కడికక్కడే కుప్పకూలి మహిళ మృతి, రోజంతా తాగాల్సిన మంచి నీళ్లు 20 నిమిషాల్లోనే..
అమెరికాలోని ఇండియానాకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి ఆష్లే సమ‍్మర్స్‌(35) జూలై లాస్ట్‌వీక్‌లో భర్త, ఇద్దరు కూతుళ్లతో కలిసి లేక్‌ ప్రీమాన్‌ వద్దకు విహార యాత్రకు వెళ్లింది. అక్కడి వేడి కారణంగా డీహైడ్రేషన్‌కు గురైంది. ఎక్కువగా దాహం వేయడంతో ఒక రోజులో తాగాల్సిన 2 లీటర్ల నీటిని 20 నిమిషాల్లోనే తాగింది.

నీళ్లే విషమై..
తక్కువ సమయంలో ఎక్కువగా నీళ్లు తాగడంతో మంచినీళ్లే విషపూరితమయ్యాయి. 20 నిమిషాల్లో నాలుగు బాటిళ్ల నీళ్లు తాగడంతో సగటు వాటర్ బాటిల్ 16 ఔన్సుల వంటిది, కాబట్టి ఆమె 20 నిమిషాల వ్యవధిలో 64 ఔన్సులు తాగింది. దీంతో ఆమెకు తలనొప్పి సమస్య వచ్చింది. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే ఆమె మరణించింది. ఆష్లే సమ‍్మర్స్‌ మరణానికి కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేశారు. చివరకు అధిక మోతాదులో నీళ్లు తాగి మృతి చెందినట్లు నిర్ధారించారు. అధిక విషపూరితమైన నీరు సేవించడం వల్లే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు.