Ahmedabad : బిల్డప్ బాబాయ్.. భార్య దగ్గర ఎన్ఐఏ ఆఫీసర్ ను అంటూ గొప్పలకు పోయి జైలు పాలు

కాంతియా ఎన్ఐఏ అధికారుల సామర్థ్యాన్ని తక్కువగా అంచనావేశాడు. ఆఫీసులోకి అనుమతి లేకుండా ఎంట్రీ ఇచ్చిన కాంతియాను చెక్ చేశారు. అతడి ID కార్డు నకిలీదని వెంటనే గుర్తించి,

Written By: NARESH, Updated On : August 4, 2023 8:40 pm
Follow us on

Ahmedabad : పురుషులు తమ భార్యలను ఆకట్టుకోవడానికి చాలా దూరం వెళుతారు. ఇది అందరి కొంపల్లో జరిగే సర్వసాధారణ విషయం. అయితే భార్య దగ్గర బిల్డప్ ఇస్తూ నేను దేశాన్ని రక్షించే సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తే? గాంధీనగర్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ఈ సాహసోపేతమైన స్కెచ్ గీశాడు. కానీ అది వికటించింది. చివరకు అతడి పరుగు పోలీసు స్టేషన్‌లో ముగుస్తుందని భావించి ఉండడు.

బిల్డప్ లకు పోయి జులు పాలు అయ్యాడు ఓ ఎన్ఐఏ సీక్రెట్ ఏజెంట్. నిజానికి అతడికి ఎన్ఐఏకు ఎలాంటి సంబంధం లేదు. కానీ భార్య దగ్గర తాను ఎన్ఐఏ ఆఫీసర్ ను అంటూ గొప్పలకు పోయాడు. నేరుగా కారు తీసుకొని ఎన్ఐఏ ఆఫీసు ముందర ఆపాడు. భార్యకు ‘నేను సీక్రెట్ ఏజెంట్ అంటూ ఆఫీసు లోపలికి పోయాడు.’ ఎన్ఐఏ ఆఫీసర్లు అంతా చెక్ చేసేసరికి మనోడి బాగోతం మొత్తం బయటపడింది. దెబ్బకు అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యాడు. గొప్పలకు పోయి తిప్పలు పడ్డ ఇతగాడి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గుంజన్ కాంతియా అనే 33 ఏళ్ల వ్యక్తి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జగత్‌పూర్ కార్యాలయంలోకి వెళ్లాడు. అతని భార్యను ఆఫీసు బయట పార్క్ చేసిన వారి కారులో ఉంచి తాను ఎన్ఐఏ ఆఫీసర్ ను అంటూ ఆఫీసులోకి కొత్త పెళ్లికొడుకులా ఎంట్రీ ఇచ్చాడు. మొగుడు ఏం పనిచేస్తున్నాడో తెలియక తికమకపడుతున్న భార్య సందేహాలను నివృత్తి చేయాలని స్కెచ్ గీశాడు. కంటియా నిజంగానే రహస్య ఎన్ఐఏ ఏజెంట్ అని ఆమెకు ‘రుజువు’ చేయాలనేది అతడి ప్లాన్.

అయితే కాంతియా ఎన్ఐఏ అధికారుల సామర్థ్యాన్ని తక్కువగా అంచనావేశాడు. ఆఫీసులోకి అనుమతి లేకుండా ఎంట్రీ ఇచ్చిన కాంతియాను చెక్ చేశారు. అతడి ID కార్డు నకిలీదని వెంటనే గుర్తించి, సమీపంలోని గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ప్రధాన కార్యాలయానికి అతడిని అప్పగించారు. అతడి నిజస్వరూపాన్ని పోలీసులకు తెలియజేశాడు.

గాంధీనగర్‌లోని మాన్సా తాలూకాలోని అల్లోవా గ్రామ నివాసి కాంతియా. అమ్రేలీ లోని కాన్తియా మాన్సాలో వీసా కన్సల్టెన్సీ సంస్థను నడుపుతున్నాడు. “మంగళవారం సాయంత్రం కాంతియా భార్యను విహారయాత్రకు తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. అయితే ఇతడు ఏం ఉద్యోగం చేస్తున్నాడోనని ఆమెకు సందేహాలు ఉండేవి. దీంతో గట్టిగా ప్రశ్నించేసరికి .. తాను ఎన్ఐఏ ఆఫీసర్ ను అంటూ నకిలీ ఐడీ కార్డ్ చూపించాడు. తన కార్యాలయానికి తీసుకెళుతానంటూ ఎన్ఐఏ ఆఫీసుకు తీసుకొచ్చాడు. అదంతా నిజమనిపించేలా అతను NIA కార్యాలయం వెలుపల వారి కారును పార్క్ చేసాడు. అనంతరం లోపలికి వెళ్లి పట్టుబడ్డాడు.

కంటియా నాలుగు సంవత్సరాలుగా నకిలీ కార్డును ఉపయోగిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది.”నకిలీ ఐడి కార్డులో అతని పేరు, జారీ చేసిన తేదీ మార్చి 14, 2018 , అతని ర్యాంక్ ఎన్ఐఏలో సబ్-ఇన్‌స్పెక్టర్ (డిప్యూటేషన్) అని చూపబడింది. ఇది నకిలీది అని గుర్తించే ఎన్ఐఏ అధికారులు అతడిని జైలుకు పంపారు. ఇదే కాదు.. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నట్టు కంటియా వద్ద ఇతర నకిలీ ఐడీలు ఉన్నట్లు గుర్తించారు.

NIA సీక్రెట్ ఏజెంట్‌గా తాను ఉద్యోగం చేస్తున్నానని కాంతియా తన భార్యను నమ్మించాడు. ఐడీ కార్డ్ చూపించినా ఆమె నమ్మకపోవడంతో ఆఫీసుకు తీసుకొచ్చి అడ్డంగా బుక్కయ్యాడు. ఇతడి వద్ద ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పలు ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీడొక మోసగాడని.. ఐడీ కార్డులతో జనాలను మోసం చేసి దండుకుంటున్నాడని తేలింది. భార్యను కూడా నమ్మిద్దామని తీసుకొచ్చి ఇలా అడ్డంగా బుక్కై జైలు పాలయ్యాడు.

కాంతియా NIAలోని ఉన్నత స్థాయి అధికారుల లోగోలు , సంతకాలను డౌన్‌లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖలు IDలను నకిలీవి సృష్టించినట్టు తేల్చారు. ప్రాథమిక విచారణలో కంటియా ఈ కార్డులను చాలా మందిని మోసం చేయడానికి.. చాలా చోట్ల ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

గత మార్చిలోనూ గుజరాత్ కు చెందిన కిరణ్ పటేల్ తాను ఆర్మీలో పెద్ద అధికారిని అంటూ కశ్మీర్ వెళ్లి Z+ భద్రతను పొందాడు. కానీ అతడో నకిలీ వ్యక్తి అని తేలడంతో ఆర్మీ పరువు పోయింది. తాజాగా అలాంటి ఘటన చోటు చేసుకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు.