
Tarakaratna- Alekhya Reddy: నందమూరి తారకరత్న ఇటీవలే చనిపోయిన ఘటన యావత్తు సినీలోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే.నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్లాది మంది నందమూరి అభిమానులు ఈ విషయాన్నీ జీర్ణించుకోలేక విషాదం లో మునిగిపోయారు.అయితే తారకరత్న చనిపోయిన తర్వాత ఆయన గురించి సోషల్ మీడియా లో ఎన్నో విషయాలు బయటకి వచ్చాయి.
తారకరత్న విజయ్ సాయి రెడ్డి చెల్లెలు కూతురు అలేఖ్య రెడ్డి ని పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదని మొదటి నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతుకు వస్తున్న వార్త.ఈ వార్తని నమ్మేవాళ్ళు ఉన్నారు, కేవలం రూమర్స్ మాత్రమే అని కొట్టిపారేసావాళ్ళు కూడా ఉన్నారు.అయితే తారకరత్న ఇంటి వద్ద ఆయన పార్థివ దేహాన్ని ఉంచినప్పుడు చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారాయి.
బెంగళూరు లోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయిన తారకరత్న మృతదేహాన్ని, నేరుగా హైదరాబాద్ లోని మోకిలా లో ఉన్న తారకరత్న స్వగృహానికి తీసుకొచ్చారు.అక్కడ బంధుమిత్రులు , సినీ మరియు రాజకీయ ప్రముఖులందరూ వచ్చారు కానీ తారకరత్న తల్లితండ్రులు మరియు ఆయన చెల్లెలు మాత్రం రాలేదు.బాలకృష్ణ మరియు విజయసాయి రెడ్డి మాత్రమే అక్కడకి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ, దగ్గరుండి పనులన్నీ చూసుకున్నారు.పక్క రోజు ఫిలిం ఛాంబర్ కి తారకరత్న పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శన కోసం ఉంచగా, అక్కడకి ఆయన తల్లితండ్రులు వచ్చారు.

చివరి చూపు చూసుకొని బోరుమని విలపించారు, కానీ అక్కడే ఉన్న తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ని మరియు ఆమె బిడ్డలను మాత్రం వీళ్ళు పట్టించుకోలేదు.ఇది పెద్ద చర్చకి దారి తీసింది, మోకిలా లో తారకరత్న పార్థివ దేహాన్ని ఉంచినప్పుడు చూడడం కోసం రాకపోవడానికి కారణం అలేఖ్య రెడ్డి తో మాట్లాడడం ఇష్టం లేకనే అట.దీనినిబట్టి ఇప్పటికీ తారకరత్న తల్లిదండ్రులకు అలేఖ్య రెడ్డి మీద కోపం తగ్గలేదని అర్థం అవుతుంది.భవిష్యత్తులో అయినా వీళ్ళు కలుస్తారో లేదో చూడాలి.
