
Rajamouli- Chiranjeevi: తెలుగు చలన చిత్ర పరిశ్రమని ప్రపంచం లో ఉన్నత స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి గొప్పతనం గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. బాహుబలి సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అగ్ర ఇండస్ట్రీ గా మన టాలీవుడ్ ని నిలబెట్టిన రాజమౌళి, #RRR చిత్రం తో ఆస్కార్ అవార్డు ని గెలుచుకొని ప్రపంచం మొత్తం మనవైపు చూసేలా చేసాడు.ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే అది తెలుగు సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా.
ఆయన కెరీర్ ఎలా ప్రారంభం అయ్యింది..అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి వంటి విషయాలు మన అందరికీ తెలిసిందే. రాజమౌళి జీవితం మన అందరికీ తెరిచినా పుస్తకం లాంటిది. కానీ ఆయన గురించి మనకెవ్వరికి తెలియని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, అవి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ద్వారా తెలిసింది. గత కొంత కాలం క్రితం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలు బయటపెట్టగా అవి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఈ ఇంటర్వ్యూ లో యాంకర్ విజయేంద్ర ప్రసాద్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ని పెట్టి సినిమా తీశారు కదా..భవిష్యత్తులో కమ్మ మరియు కాపు సామాజిక వర్గాలకు గాలెం వేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారా’ అని అంటాడు.

అప్పుడు విజయేంద్ర ప్రసాద్ దానికి సమాధానం చెప్తూ ‘నా వివాహం 1966 వ సంవత్సరం లో జరిగింది. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా భార్య కులం ఏంటో కూడా నాకు తెలియదు. మా పెళ్ళైన కొన్నాళ్ళకు చిరంజీవి గారి ఖైదీ సినిమా విడుదలైంది.అప్పుడు నా భార్య చిరంజీవి మా సొంత బంధువు అవుతాడు అని చెప్పుకొచ్చింది. అప్పుడు తెలిసింది నా భార్య కాపు అని, మా కుటుంబం లో వివాహాలన్నీ ప్రేమ వివాహాలే, కులమత భేదాలను మేము చూడము’ అంటూ చెప్పుకొచ్చాడు విజయేంద్ర ప్రసాద్.ఈయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.