
Fertility Problems: ఇటీవల కాలంలో చాలా మంది సంతాన లేమితో బాధపడుతున్నారు. ఆధునిక ఆహార శైలితో ఇలాంటి తిప్పలు పడుతున్నారు. సంతాన లేమికి కారణాలనేకం ఉన్నాయి. ఆహార అలవాట్లు ప్రధానంగా ప్రతిబంధకంగా మారుతున్నాయి. పూర్వం రోజుల్లో ఇలాంటి ఆహారాలు లేకపోవడంతో వారికి సంతాన లేమి సమస్య ఉండేది కాదు. ఈ నేపథ్యంలో సంతాన భాగ్యం కోసం ఏం చర్యలు తీసుకోవాలో తెలుసుకుని వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
సంతానలేమితో బాధపడే వంద జంటలను తీసుకుంటే అందులో 60-70 శాతం స్త్రీలు ఇంఫర్టయిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. 30-40 శాతం మంది మగవారు కూడా ఈ సమస్యతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో సంతాన లేమిని అధిగమించాలంటే కొన్ని చర్యలు తీసుకోవాల్సిందే. మగవారిలో ఈ సమస్యతో బాధపడటానికి హార్మోన్ల సమస్య కూడా ఒక కారణమే అని చెబుతున్నారు.
సంతానం కలగాలంటే మగవారిలో తగినన్ని వీర్యకణాలు ఉండాలి. 60-70 మిలియన్ల వరకు వీర్య కణాలు ఉంటే సంతాన భాగ్యానికి ఢోకాల లేదని అర్థం. ఇంకా ఎక్కువ సంఖ్యలో వీర్య కణాలు ఉంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో సంతానం కోసం అందరు ఎదురు చూడటం సహజమే. కానీ వారికి సంతానం కలిగించే ఆహారాలు తీసుకుంటే ఫలితం వస్తుందని గ్రహించుకోవాలి.

సంతాన లేమి సమస్యను దూరం చేసేందుకు దానిమ్మ రసం బాగా పనిచేస్తుంది. రోజు 250 మిల్లీ గ్రాముల దానిమ్మ రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఎనిమిది వారాల పాటు చేయాలి. దీంతో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి సంతాన భాగ్యం లభిస్తుంది. ఇంకా డిన్నర్ లో పుచ్చగింజల పప్పు చేర్చుకుంటే మంచిది. దీని వల్ల కూడా వీర్యకణాల సంఖ్య పెరుగుతాయి. దీని వల్ల సంతానం కలుగుతుంది. ఇలా ఈ చిట్కాలు ఉపయోగిస్తే మనకు సంతానం సమస్య నుంచి దూరం కావచ్చు.