Wife and Husband: ప్రస్తుత సమాజంలో చాలామంది వావి వరసలు మర్చిపోతున్నారు. మరీ మృగాళ్ల లాగా ప్రవర్తిస్తున్నారు. చివరకు ఇంట్లో వారి మీదే వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనల్లో దోషులకు ఎలాంటి పెద్ద శిక్షలు పడుతున్నాయో చూస్తూనే ఉన్నాం. అయినా సరే చాలామంది తమ వక్రబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. ఇకపోతే ఇప్పుడు కూడా ఓ వ్యక్తి ఇలాగే చేశాడు. విజయవాడ టౌన్ లో నివాసం ఉండే మహిలకు ఇది వరకే భర్తతో విడాకులు అయ్యాయి.

కాగా ఆమెకు ఇద్దరు పిల్లలు. 9వ తరగతి చదివే కుమార్తె తో పాటు చిన్న బాబు కూడా ఉన్నాడు. అయితే ఆమెకు అది వరకే భార్యతో విడాకులు అయిన వ్యక్తితో రెండో వివాహం జరిగింది. రెండో భర్తతో కలిసి ఆమె, పిల్లలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే తొమ్మిదో తరగతి చదవి బాలికపై ఆ సవతి తండ్రి కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా నగ్న వీడియోలను చిత్రీకరించాడు.

Also Read: పోసాని, అలీలకు టైం వచ్చింది.. పదవులకు జగన్ రెడీ
వాటితోనే రాక్షసానందం పొందుతున్నాడు. దీంతో ఒకరోజు భార్య తన భర్త మొబైల్ చూస్తుండగా.. కూతురు నగ్న వీడియో కనిపించింది. దానిపై ఆమె అడగ్గా.. అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇక ఆమె మాత్రం అక్కడితో వదిలేస్తే దారుణం జరుగుతుందని, భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తి ఇలాంటి దారుణానికి ఒడిగడుతాడా అంటూ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే గతంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భర్తతో విడిపోయిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళా టీచర్‌ను.. విశాఖపట్నానికి చెందిన టీచర్ లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత నగ్న వీడియోలు తీసి నిత్యం వేధించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతన్ని అరెస్ట్ చేశారు.