Film Studios in AP: తాజాగా సినీ నటులతో ఏపీ సీఎం జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే. అందులో ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాలు సైతం చర్చకు వచ్చినట్టు సమాచారం. పలు సమస్యలను సైతం వారు సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే సీని ఇండస్ట్రీని ఓ రేంజ్ లోకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు ప్రారంభించింది.

వీటి ఏర్పాటుకు భూమి అవసరం కావడంలో ముందుగా భూసేకరణను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఆ సినీ నటుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ విశాఖలో స్టూడియోల ఏర్పాటుకు స్థలాలు ఇస్తామని జగన్ మాటిచ్చారని సమాచారం.
వారితో భేటీ అయిన రెండు రోజులకే విశాఖతో పాటుగా రాజమహేంద్రవరం, తిరుపతిలోనూ స్టూడియోల ఏర్పాటుకు సంబంధించి భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి చెందిన భూములను సైతం గుర్తించాలని అధికారులను ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. హామీ ఇచ్చి రెండు రోజులు తిరక్క ముందే పనిలో ఇంత స్పీడ్ ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్స్ తో పాటు వేటినీ వదలకుండా సెంటు, సెంటున్నర చొప్పున పంచేసింది. మరి కొంత భూమిని సేకరించి స్మార్ట్ టౌన్‌షిప్ పేరుతో అమ్మకం పెట్టింది. ఇక ప్రస్తుతం స్టూడియోల ఏర్పాటుకు భూమి అవసరం కావడంతో ఆ భూమిని రైతుల నుంచే సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: పోసాని, అలీలకు టైం వచ్చింది.. పదవులకు జగన్ రెడీ
ఇలా ప్రతి దానికీ రైతుల నుంచి భూమిని సేకరించి.. ఇతరులకు దారపోయడంపై చాలా రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత చేసీ స్టూడియోల ఏర్పాటుకు భూములు ఇస్తే.. భూమిని తీసుకున్న వారు అందులో స్టూడియో ఏర్పాటు చేస్తారో లేదో మాత్రం తెలియదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ ఇలాగే జరిగింది. ఓ ప్రాజెక్టు చేపట్టాలని ఆలోచన వచ్చిందంటే అక అందుకు సంబంధించి భూమిని సేకరించాలని వైఎస్సార్ అంటుండేవారు.
ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనూ అదే కనిపిస్తోందంటున్నారు పలువురు. మరి ఈ విషయంలో జగన్ సర్కార్ మరింత దూకుడగా వ్యవహరిస్తుందా? లేదంటే స్టూడియో ఏర్పాటు చేసే వారికి ఏమైనా కండీషన్స్ పెడుతుందా అనేది వేచి చూడాలి. ఒక వేళ్ స్టూడియో ఏర్పాటు చేయకుండా స్థలాన్ని తిరిగి వెనక్కి తీసుకునేలా ముందే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తే బాగుంటుందని చెబుతున్నారు విశ్లేషకులు.
[…] […]