Uttar Pradesh: మన దేశ వివాహ వ్యవస్థ గొప్పదని.. అద్భుతమైన విలువలు కలదని.. ప్రపంచానికి ఆదర్శవంతమైనదని అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటాం కదా.. ప్రపంచ దేశాల ఎదుట గొప్పగా వివరిస్తాం కదా.. కానీ మన దగ్గర కూడా అప్పుడప్పుడు నలుపు మరకలు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆ తరహా దృశ్యాలు వీడియోల రూపంలో కనిపిస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పైగా మన దేశం ఇలా మారిపోయింది ఏంటి అనే బాధ కూడా కలుగుతుంది.
అది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం. ఆ మహిళ ఏకంగా సోషల్ మీడియాలోకి వచ్చేసింది. చూడ్డానికి అందంగా ఉంది. తన అందానికి తగ్గట్టుగానే కళ్ళజోడు ధరించింది. సెల్ఫీ వీడియోలో అసలు విషయం చెప్పేసింది. ఆమె చెబుతుంటే ఎటువంటి బెరుకు లేదు. భయం అంతకంటే లేదు. స్వేచ్ఛగా మాట్లాడింది. తనలో ఉన్న భావాలను మొత్తం వెల్లడించింది..” నాకు కొంత కాలం క్రితం పెళ్లయింది. మా దాంపత్యానికి గుర్తుగా ఒక పాప జన్మించింది. ఆ తర్వాత భర్త పట్టించుకోవడం మానేశాడు. నన్ను, నా కుమార్తెను వదిలిపెట్టి దుబాయ్ వెళ్లిపోయాడు. ఆయన కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. కనీసం ఫోన్ కాల్ కూడా లేదు. నా సోషల్ మీడియా అకౌంట్లు మొత్తం బ్లాక్ చేశాడు. ఆయనకు ఫోన్ చేస్తే కలవడం లేదు. ఇతర నెంబర్లనుంచి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఎదురుచూసి చూసి తట్టుకోలేకపోయాను. నా కూతురు కూడా ప్రేమ రాహిత్యంతో బతుకుతోంది. ఇవన్నీ కూడా అవసరమా అనిపిస్తోంది. అందువల్లే ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకంటూ ఒక తోడును వెతుక్కున్నానని” ఆ మహిళ వెల్లడించింది.
” భర్త కోసం ఎదురుచూసినప్పటికీ ఫలితం లేదని అర్థమైంది. పైగా అతడు మాతో ఫోన్ కూడా మాట్లాడలేదు. ఖర్చులకు డబ్బులు కూడా పంపించడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందువల్లే నేను మా మామను ఇష్టపడ్డాను. అతనితో కలిసి సొంత ఊరు నుంచి బయటికి వచ్చాను. ప్రస్తుతం మేమిద్దరం కలిసి జీవిస్తున్నాం. మా పాప కూడా మాతోనే ఉంటున్నది. ఆమె స్థానికంగా ఉన్న ఒక పాఠశాలకు వెళ్తోంది. మా పాపకు అన్ని విషయాలు చెప్పాను. ఆమె అంగీకారంతోనే మా మామతో కలిసి బయటికి వచ్చాను. మా మామ నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. అన్ని అవసరాలు తీర్చుతున్నాడు. కష్టకాలంలో అండగా ఉన్నాడు. ఇన్నాళ్లకు దేవుడు నా బాధ ఆలకించి ఒక తోడును నాకోసం పంపించాడు. నా సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం నా భర్త బ్లాక్ చేశారు కాబట్టి.. నేను కూడా అదే పని చేశాను. ఇప్పుడు నాకు నచ్చినట్టుగానే బతుకుతున్నాను. స్వేచ్ఛగా జీవిస్తున్నానని” ఆ మహిళ పేర్కొంది. ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరోవైపు ఆమె మామ భార్య లేదని.. అందువల్లే ఈమెతో వచ్చాడని తెలుస్తోంది. ఆమె వ్యవహార శైలిని కొంతమంది తప్పు పడుతుండగా.. మరి కొంతమంది సమర్థిస్తున్నారు.
Husband went to Dubai for work.
Wife started to live in with father-in-law outside the village.Marriage institution pic.twitter.com/EpB5WHP9OE
— ShoneeKapoor (@ShoneeKapoor) September 19, 2025