https://oktelugu.com/

వేరే వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం చూసి భర్త ఏం చేశాడంటే?

వివాహేతర సంబంధం.. భర్త ఉండగానే పరాయి పురుషుడితో ఓ మహిళ పెట్టుకునే అక్రమ సంబంధం.. అది ఎప్పటికీ దాగదు.. ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతూనే ఉంటుంది. అలా పడితే ఆ సంసారం చట్టబండలు అవుతుంది. హత్యలకు దారితీస్తుంది..ఇప్పుడు అదే జరిగింది. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం సాగించడం కళ్లారా చూసిన భర్త రగిలిపోయి రోకలిబండతో ఆమె తలపై బాది దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో చోటుచేసుకుంది. పట్నం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2021 / 05:39 PM IST
    Follow us on

    వివాహేతర సంబంధం.. భర్త ఉండగానే పరాయి పురుషుడితో ఓ మహిళ పెట్టుకునే అక్రమ సంబంధం.. అది ఎప్పటికీ దాగదు.. ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతూనే ఉంటుంది. అలా పడితే ఆ సంసారం చట్టబండలు అవుతుంది. హత్యలకు దారితీస్తుంది..ఇప్పుడు అదే జరిగింది.

    hema

    భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం సాగించడం కళ్లారా చూసిన భర్త రగిలిపోయి రోకలిబండతో ఆమె తలపై బాది దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో చోటుచేసుకుంది.

    పట్నం గ్రామానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇతడికి 10 ఏళ్ల క్రితం సోమందేపల్లి మండలం గడిపల్లి గ్రామానికి చెందిన గోపాలప్ప కుమార్తె హేమలత (28) అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం..

    అయితే భర్త ఉండగానే భార్య హేమలత అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై పలుమార్లు పద్ధతి మార్చుకోవాలని భార్యను భర్త హెచ్చరించింది. అయినా ఆమె ఖాతరు చేయలేదు. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో తన భార్య రామాంజనేయులతో కలిసి ఉండడం కళ్లారా చూసిన భర్త శివశంకర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పక్కనే ఉన్న రోకలిబండతో భార్య తలపై బాదాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. ఇది చూసి భయపడిన రామాంజనేయులు పారిపోయాడు.

    ఆ తర్వాత వెంటనే భార్య హేమలత తండ్రి గోపాలప్పకు ఫోన్ చేసిన శివశంకర్ నీ కూతురు అక్రమ సంబంధం పెట్టుకొని నాకు డైరెక్టుగా దొరికిందని.. ఆమెను చంపేశానని ఫోన్ చేసి చెప్పాడు. ఇలా భార్య వక్రబుద్దికి మోసానికి ఆ భర్త తగిన శాస్తి చేశాడని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

    Also Read: Chandrababu Crying: చంద్రబాబు.. నాడు ఏడిపించాడు.. నేడు ఏడ్చాడు