Balayya: ఎప్పుడూ గంభీరంగా ఉండే బాలకృష్ణ హోస్ట్ గా టాక్ షో అంటే అందరూ షాక్ తిన్నారు. ఆయన హోస్ట్ గా సక్సెస్ కావడం జరగని పని అంటూ పెదవి విరిచారు. ఫీల్డ్ ఏదైనా బాలయ్య అడుగుపెడితే రికార్డులు గల్లంతే అని.. నిరూపించి, విమర్శకుల నోళ్లకు తాళం వేశాడు. బాలయ్య హోస్ట్ గా ప్రసారమైన రెండు ఎపిసోడ్స్ సూపర్ సక్సెస్ కొట్టాయి. బాలయ్య టాక్ షోతో ఆహా చందాదారులు విపరీతంగా పెరిగినట్లు, స్వయంగా నిర్వాహకులు తెలియజేశారు.

ముఖ్యంగా ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా వచ్చిన మోహన్ బాబు, బాలయ్య మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. ఎక్కడా డిప్లమాటిక్ ప్రశ్నలకు, సమాధానాలను తావు లేకుండా బోల్డ్ గా సాగింది. అన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని, చంద్రబాబు చేతిలో ఎందుకు పెట్టావ్..? అని బాలయ్యను మోహన్ బాబు అడగడం ఊహించని పరిణామం. అలాంటి ప్రశ్న ఫేస్ చెయ్యడానికి బాలయ్య ఒప్పుకోవడం, అందరినీ షాక్ కి గురి చేసింది. మందు కబుర్ల నుండి, ఫ్లాప్ సినిమాల వరకు అంతా జెన్యూన్ గా ఎపిసోడ్ సాగింది.
ఈ నేపథ్యంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా సెల్వమణి… బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోకి గెస్ట్ గా రానున్నారని తెలిసి, ప్రేక్షకులలో చర్చ మొదలైంది. మొదటి ఎపిసోడ్ అనుభవం రీత్యా.. బాలయ్య, రోజా మధ్య రాజకీయ చర్చ జరిగే అవకాశం కలదని కొందరు భావిస్తున్నారు. బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేగా , రోజా వైసీపీ ఎమ్మెల్యేగా ఉండగా… ఇరుపార్టీల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి నిజంగా రోజా అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా వస్తే, జరిగే ఆసక్తికర రాజకీయ రచ్చ చూడాలని, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Actor Surya: మెగాస్టార్ కు పోటీగా వస్తున్న సూర్య…
మరోవైపు ఈ షోకి చిన్న బ్రేక్ పడింది. బాలయ్య చేతికి సర్జరీ కాగా, లేటెస్ట్ ఎపిసోడ్ చిత్రీకరణ జరగలేదు. దీనితో మూడవ ఎపిసోడ్ ఆలస్యం కానుంది.
Also Read: అరంగేట్రం అక్కాచెల్లెళ్లు ఇద్దరినీ దెబ్బేసింది..!