https://oktelugu.com/

Actor Surya: మెగాస్టార్ కు పోటీగా వస్తున్న సూర్య…

Actor Surya: ప్రముఖ హీరో సూర్య  డైరెక్ట‌ర్ పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న చిత్రం ‘ఎదుర్కుమ్ తునిందవన్’. దాదాపు రెండేళ్ల త‌ర్వాత సూర్య థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఆయన నటించిన ఆకాశం నీ హ‌ద్దురా, జై భీమ్ చిత్రాలు ఓటీటీ లోనే విడుద‌లై అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ క్ర‌మంలో డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ నుంచి సూర్య‌కు వ్య‌తిరేక‌త వ‌చ్చింది. కానీ క‌రోనా ప‌రిస్థితుల స‌మ‌యంలో థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కులు రావ‌డానికి ఇబ్బంది ప‌డుతుండ‌టంతో త‌న రెండు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 19, 2021 / 05:11 PM IST
    Follow us on

    Actor Surya: ప్రముఖ హీరో సూర్య  డైరెక్ట‌ర్ పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న చిత్రం ‘ఎదుర్కుమ్ తునిందవన్’. దాదాపు రెండేళ్ల త‌ర్వాత సూర్య థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఆయన నటించిన ఆకాశం నీ హ‌ద్దురా, జై భీమ్ చిత్రాలు ఓటీటీ లోనే విడుద‌లై అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ క్ర‌మంలో డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ నుంచి సూర్య‌కు వ్య‌తిరేక‌త వ‌చ్చింది. కానీ క‌రోనా ప‌రిస్థితుల స‌మ‌యంలో థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కులు రావ‌డానికి ఇబ్బంది ప‌డుతుండ‌టంతో త‌న రెండు చిత్రాల‌ను నేరుగా ఓటీటీలోనే విడుద‌ల చేశారు. అయితే ఈ చిత్రాన్ని నేరుగా థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేస్తున్నారు.

    ఈ మేరకు తాజాగా ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా ఈ చిత్రానికి తెలుగు టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు. అయితే అదే రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన ” ఆచార్య‌ ” సినిమాను కూడా అదే రోజున విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస హిట్స్ మీద సూర్య ఒక‌వైపు… చిరంజీవి ఆచార్య మ‌రో వైపు ఉండడంతో ఈ రెండు ప్రాజెక్టులపై ప్రేక్ష‌కుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆచార్య మూవీని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. ఇందులో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. కాజ‌ల్ అగ‌ర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా న‌టించారు.

    మరి ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల అవుతుండడంతో పోటీ తప్పదని అర్దం అవుతుంది. మ‌రి అదే రోజున చిరంజీవి, సూర్య‌తో పాటు ఇంకెవ‌రైనా పెద్ద హీరోలు థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి రాబోతున్నారనే విష‌యం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.