Madhya Pradesh Husband And Wife: గతంలో తెలుగులో జంబలకిడిపంబ అనే సినిమా వచ్చింది. అందులో అన్ని రివర్స్ లో ఉంటాయి. ఆడవాళ్లు మగాళ్ల లాగా మగాళ్లు ఆడవారి లాగా వ్యవహరిస్తుంటారు. అదో రకమైన కామెడీ చిత్రం. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక్కడ కూడా ఓ గమ్మత్తైన విషయం జరిగింది. సాధారణంగా మగాడు కొట్టాడని ఆడవారు గొడవ పడుతుంటారు. కానీ ఓ మగాడు తన భార్య కొట్టిందని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం సంచలనం సృష్టిస్తోంది. తన భార్య కళ్లల్లో కారం పోసి మరీ దాడి చేసిందని ఆరోపించాడు. తన భార్యతో ప్రాణభయం ఉందని ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం గమనార్హం.

మధ్యప్రదేశ్ లోని మొరెనా జిల్లా రితోరా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సంజయ్ సింగ్ కు పూజతో రెండేళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లు వీరి సంసారం సజావుగానే సాగినా తరువాత కలతలు మొదలయ్యాయి. నిత్యం గొడవలతోనే సహజీవనం చేసేవారు. ఈ క్రమంలో సంజయ్ ప్లంబర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య పూజ అత్తింటి వారితో సఖ్యతగా ఉండేది కాదు. రోజు గొడవ పడుతుండేది. దీంతో సంజయ్ కు సహనం నశించేది. ఎంత కాలం అయినా ఆమెలో మార్పు రాలేదు. ఓపిక కోల్పోయిన సంజయ్ ఓ సారి భార్యపై చెంపదెబ్బ కొట్టాడు. నీ ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. ఆమె మాత్రం ససేమిరా అనడంతో ఇక నువ్వు ఇక్కడ ఉంటే బాగుండదని నీ పుట్టింట్లో దింపుతానని తీసుకెళ్లాడు.
Also Read: Samantha: సమంత గ్లామర్ షో.. మత్తెక్కించింది, మతి పోగొట్టింది !
పుట్టింటికి వెళ్లిన తరువాత పూజ, ఆమె తల్లిదండ్రులు, సోదరులు కలిసి సంజయ్ పై దాడికి దిగారు. కంట్లో కారం కొట్టి ఇటుకలతో కొట్టారు. దీంతో అతడు భయభ్రాంతులకు గురయ్యాడు. తన భార్యతో తనకు ప్రమాదం ఉందని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో గోడు వెళ్లబోసుకున్నాడు. తన భార్యతో తనకు హాని ఉందని వాపోయాడు. తనను చంపడానికే ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంజయ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్తింటి వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు దాడికి పాల్పడింది నిజమే అని తేలితే అరెస్టు చేస్తామని ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు.

భార్య కొట్టిందని ఫిర్యాదు చేయడమే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భర్త బాధితులు ఉంటారు కానీ ఇతడు మాత్రం వెరైటీగా భార్యా బాధితుడిగా మారడం సంచలనం కలిగిస్తోంది. దీంతో సంజయ్ పడుతున్న బాధలను చూసి భార్యలు ఇలాగా కూడా ఉంటారా? అని ఆలోచనలో పడిపోతున్నారు. భార్యా బాధితుడిగా సంజయ్ రికార్డులకు ఎక్కడం ఆశ్చర్యకరమే అనిపిస్తోంది. మొత్తానికి సంజయ్ భార్య, వారి బంధువులపై చర్యలు తీసుకుంటారో లేదో తెలియడం లేదు. భార్యా భర్తల తగాదాలు పొద్దున్నే వచ్చి సాయంత్రం పోయేవిగా చెబుతుంటారు. కానీ ఇక్కడ కేసు పెట్టే వరకు వెళ్లడంతో అందరు ఆసక్తిగా చూస్తున్నారు.
F3 Movie: ‘ఎఫ్ 3’ యూఎస్ ప్రీమియర్స్ రెడీ.. ఎన్ని వందల స్క్రీన్స్ లో అంటే.. ?
Recommended Videos: