Toyota Fortuner updated model launch date: SUV కార్లను మార్కెట్లోకి తీసుకురావడంలో Toyota కంపెనీ ముందు ఉంటుంది. ఇప్పటికే ఎన్నో రకాల ఆకట్టుకునే మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. అయితే ఈ ఏడాది ఈ కంపెనీ నుంచి కొత్త కారు ఎప్పుడూ వస్తుందా? అని ఎదురుచూసేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసం కంపెనీ శుభవార్త తెలిపింది. ఈ ఏడాది చివర్లో లేదా 2027 ప్రారంభంలో టయోటా ఫార్చునర్ కొత్త కారును తీసుకురాబోతుంది.. దీనిని ఇప్పటికే విదేశాల్లో పరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ఫార్చునర్ తో పోలిస్తే ఇది అప్డేట్ వర్షంతో పాటు అనేక రకాల లేటెస్ట్ టెక్నాలజీ తో తయారవుతుంది. ఇంతకీ ఈ కారు ఎలా ఉండబోతుంది అంటే?
మార్కెట్లోకి వచ్చే వచ్చే SUV కొత్త కారు ఎక్స్టీరియర్ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉండనుంది. దీని LED లైటింగ్స్ ఆకట్టుకుంటాయి. వెనుక వైపు ఉన్న టెయిల్ లైట్స్ కూడా ప్రీమియం లుక్ ను అందిస్తాయి. దీనికి ఉండే అల్లాయ్ వీల్స్, రక్షణ కవచంగా ఉండే క్లాడింగ్, బ్యాక్ సైడ్ బంపర్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటివి కారుకు అందాన్ని తీసుకువస్తాయి. ఈ కారు ఇంటీరియర్ డిజైన్ లో భాగంగా 12.3 అంగుళాల డిజిటల్ డిస్ప్లే చూడొచ్చు. అలాగే ఇదే సైజులో ఇన్ఫోటైన్మెంట్ సిస్టం కూడా ఉంటుంది. దీంతో డ్రైవర్లకు సమాచారం అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉండలు ఉన్నాయి. లెవెల్ 2 డ్రైవర్ అసిస్టెంట్ సిస్టం, 360 డిగ్రీ సరౌండు వ్యూ కెమెరా, కనెక్ట్ చేయబడిన ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్ వంటి ఫీచర్లు కనిపించనున్నాయి.
నేటి తరం వారు ఎక్కువగా కోరుకునే పనోరమిక్ సన్ రూఫ్ ఇందులో ఆకర్షణీయం. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో ప్రయాణికులకు స్వచ్ఛమైన వాతావరణం ఉండరు ఉంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఫార్చునర్ కంటే ఇది అప్డేట్ వెర్షన్తో రాబోతుంది. ఫార్చునర్ కారుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.. అయితే ఇది కొత్త తరహాలో రానుండడంతో దీనిపై మరింత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చిన వెంటనే భారత్ లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు లీకులు ఇస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ఫార్చునర్ కారు రూ.34.16 లక్షల నుంచి రూ.49.59 లక్షల వరకు విక్రయిస్తున్నారు. కొత్తగా వచ్చే ఫార్చునర్ కారు కూడా ఇంతే ధరలో ఉంటుందని భావిస్తున్నారు. అయితే కంపెనీ ఏ ధరకు నిర్ణయిస్తుందో చూడాలి.