S. S. Rajamouli: టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి పేరు వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. ఆయన ఇటీవల తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో ఆయన గురించే చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో రాజమౌళికి సంబంధించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. లేటేస్టుగా ఆయన సినిమా పోస్టర్ పై ఓ ముద్ర ఉంటుంది. దానిని ఎందుకు వేస్తారు? అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఏ సినిమా పోస్టర్ పై లేని ఈ స్టార్ రాజమౌళి సినిమా పోస్టర్ పైనే ఎందుకు ఉంటున్న ఆసక్తి చర్చ సాగుతోంది.
రాజమౌళి మొదటి సినిమా ‘స్టూడెంట్ నెంబర్ 1’ తోనే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన రెండు, మూడు సినిమాలు తీసే వరకు సాధారణ ప్రేక్షకులకు ఎవరికీ తెలియదు. ప్రభాస్ తో ఆయన తీసిన ‘ఛత్రపతి’ నుంచి రాజమౌళి గురించి చర్చ ప్రారంభమైంది. ఆ తరువాత రామ్ చరణ్ తో కలిసి ‘మగధీర’ మూవీతో జక్కన్న స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. అప్పటి నుంచి రాజమౌళి తీసే సినిమా పోస్టర్ పై ముద్రను గమనించడం మొదలైంది. వాస్తవానికి అంతకుముందు నుంచే ఈయన సినిమా పోస్టర్ పై ఈ స్టాంఫ్ ఉండేదట. కానీ పెద్దగా పట్టించుకోలేదు.
మరి ఈ ముద్రను ఎందుకు వేస్తారు? అని ఓ టీవీచానెల్ లో అడగగా.. ఆసక్తికర సమాధానం చెప్పారు. ఏ సినిమాకైనా డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆయన పేరు ఎక్కువ సార్లు వినిపించదు. ఎక్కడో చిన్నగా డైరెక్టర్ పేరు వేస్తారు. నేను తీసే సినిమా పోస్టర్ పై నా పేరు అలా వేయడం ఇష్టం లేదు. అందుకే స్పెషల్ గా స్టాంప్ మోడల్ తయారు చేయించి పోస్టర్ పై వేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది రాజమౌళి సినిమా అని అందరూ అర్థం చేసుకుంటారు.
ఇక చదువుకోని వారు రాజమౌళి సినిమా అని తెలియడానికి ఈ స్టాంప్ చాలా ఉపయోగపడుతుంది. అందుకే దీనిని ప్రత్యేకంగా తయారు చేసి వేయించాం. అని రాజమౌళి చెప్పుకొచ్చారు. రాజమౌళి తరువాతి సినిమా మహేష్ బాబుతో తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కథను సిద్ధం చేసిన ఆయన లోకేషన్స్ కోసం వేట ప్రారంభించారని అంటున్నారు. అయితే ఈ సినిమా గురించి రాజమౌళి ఎప్పుడు అనౌన్స్ చేస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు.