Teja Sajja Mirai TRP ratings: ‘హనుమాన్’ వంటి భారీ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్ గా నిల్చింది. తెలుగు, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషలకు కలిపి ఈ చిత్రం సుమారుగా 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మీడియం రేంజ్ హీరోల క్యాటగిరీలో దశాబ్దాల నుండి కొనసాగుతున్న ఎంతో మంది హీరోలు సాధించలేని వసూళ్లను, నిన్న గాక మొన్న వచ్చిన తేజ సజ్జ అవలీలగా సాధించడం సాధారణమైన విషయం కాదు. ఇకపోతే ఈ చిత్రం లో విలన్ గా నటించిన మంచు మనోజ్ కి కూడా మంచి పేరొచ్చింది. రీ ఎంట్రీ తర్వాత ఆయనకు సరైన పాత్ర దక్కిన ఫీలింగ్ అందరిలోనూ కలిగింది. పేరుకే విలన్, కానీ సినిమాలో హీరోకంటే చాలా పవర్ ఫుల్.
ఓటీటీ లో కూడా ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే రీసెంట్ గానే ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేశారు. ఈ టెలివిజన్ ప్రీమియర్ తో ఈ చిత్రం మరో మైలు రాయిని అందుకుంది. ఈ ప్రీమియర్ కి TRP రేటింగ్స్ 9.1 వచ్చిందట. ఓటీటీ లో అందరూ బాగా చూసిన తర్వాత కూడా ఈ రేంజ్ రేటింగ్స్ ఒక మీడియం రేంజ్ సినిమాకు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా అర్బన్ ప్రాంతాల నుండి ఈ చిత్రానికి ఏకంగా 10.80 TRP రేటింగ్స్ నమోదు అయ్యాయట. ఈమధ్య కాలం లో పెద్ద సినిమాలకు కూడా ఈ రేంజ్ రేటింగ్స్ నమోదు అవ్వలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రానికి ఇదే స్టార్ మా ఛానల్ లో 14 TRP రేటింగ్స్ నమోదు అయ్యాయి.
పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ‘పుష్ప 2’ కే 14 రేటింగ్స్ వచ్చిందంటే, ఇక మిగిలిన సినిమాలు కనీస స్థాయిలో అయినా టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకుంటుందా ని అనేవారు విశ్లేషకులు. అలాంటి వాళ్ళను కూడా ఆశ్చర్యపరుస్తూ ఈ చిత్రం ఇంతటి రేటింగ్స్ ని నమోదు చేసుకోవడం నిజంగా షాకింగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి’ సీక్వెల్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ లెవెల్ లో తెరకెక్కించబోతున్నారు. చూస్తుంటే తేజ సజ్జ మినీ ప్రభాస్ అయ్యేలా ఉన్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
