spot_img
Homeఎంటర్టైన్మెంట్Pakistani actress in Pawan Kalyan film: పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో పాకిస్థాన్ హీరోయిన్...

Pakistani actress in Pawan Kalyan film: పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో పాకిస్థాన్ హీరోయిన్ కి ఛాన్స్..ఇది మామూలు ట్విస్ట్ కాదుగా!

Pakistani actress in Pawan Kalyan film: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గతం లో ఒప్పుకున్న మూడు సినిమాల షూటింగ్స్ పూర్తి అయ్యాక, ఆయన తన సమయాన్ని మొత్తం పాలన పైనే వెచ్చించాడు. మళ్లీ సినిమాల్లో నటిస్తాడా లేదా అనే అనుమానం అందరిలో ఉండేది. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ని యాక్టీవ్ చేసాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి వరుసగా నాలుగు సినిమాలు నిర్మించడానికి రెడీ అయ్యాడు. పవన్ కళ్యాణ్ మూవ్మెంట్స్ ని చూసి ఇక మీదట ఆయన నిర్మాతగా మాత్రమే కొనసాగుతాడు, నటించడం అనుమానమే అని అనుకున్నారు. కానీ కొత్త సంవత్సరంలో సురేందర్ రెడ్డి తో పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ఉంటుందని అధికారిక ప్రకటన చేశారు. జనసేన పార్టీ కి ప్రధాన కార్యదర్శి గా వ్యవహరిస్తున్న రామ్ తాళ్ళూరి ఈ చిత్రానికి నిర్మాత. ఉగాది రోజున ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ క్యారక్టర్ పై సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్(Rebel Star Prabhas), హను రాఘవపూడి(Hanu Raghavapudi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ లో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్న ఇమాన్వి(Imanvi) ని, పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇమాన్వి పాకిస్తాన్ దేశానికి చెందిన అమ్మాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ‘ఆపరేషన్ సింధూర్’ సమయం లో ఒక పాకిస్థాన్ హీరోయిన్ తో సినిమా ఎలా చేస్తారు?, వెంటనే ఆమెని ఈ చిత్రం నుండి తొలగించండి అంటూ పెద్ద ఎత్తున నెటిజెన్స్ డిమాండ్ చేశారు. ఈ ప్రచారం బాగా వైరల్ అవ్వడం తో ఇమాన్వి అప్పట్లో రెస్పాన్స్ ఇస్తూ ‘నేను పాకిస్థానీ అమ్మాయిని కాదు, ఇండియన్ ని, ప్రస్తుతం అమెరికా లో ఉంటున్నాను’ అంటూ క్లారిటీ ఇచ్చింది.

కానీ నెటిజెన్స్ ఆమె మాటలను నమ్మలేదు. గతంలో ఆమె వేసిన కొన్ని పోస్టులను చూపిస్తూ, నువ్వు పాకిస్తానీ అమ్మాయి వే అంటూ కామెంట్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ అమ్మాయి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల కాంట్రవర్సీ క్రియేట్ అవుతుందా?. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి, NDA లో నేషనల్ లెవెల్ లీడర్. అలాంటి నాయకుడు శత్రు దేశానికి సంబంధించిన హీరోయిన్ తో కలిసి నటిస్తే, కచ్చితంగా విమర్శలు ఎదురుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇమాన్వి ని హీరోయిన్ గా ఎంచుకున్నారు అనేది గాసిప్ మాత్రమే, ఒకవేళ అధికారికంగా ఖరారు అయితే మాత్రం విమర్శలు ఎదురుకోవాల్సిందే. కానీ ఇది ఖరారు అయితే ఇమాన్వి ది మాత్రం మామూలు లక్ కాదనే చెప్పాలి. ఎందుకంటే కెరీర్ ప్రారంభంలో మొదటి రెండు సినిమాలు ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ తో చేసే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version