South India Vs North India
South Indian Vs North India: మన ప్రాంతం , మన భాషా మరియు మన సంస్కృతి ని గౌరవించడం ప్రతీ భారతీయుడి ప్రధమ కర్తవ్యం, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మన బాషా ని ఎంత ప్రేమిస్తామో, ఇతర భాషలను కూడా అంతే ప్రేమించాలి. నేడు మన సౌత్ ఇండియా జరుగుతున్నది ఏమిటంటే బాషా మరియు ప్రాంతీయ బేధాలతో వాదించుకుంటున్నాం,కొట్టుకుంటున్నాం. దేశం లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి కేవలం భాష కోసం గొడవ పడడం వాళ్ళ ఏమిటి ఉపయోగం.?,నార్త్ ఇండియా లో గుజరాతి, పంజాబీ , మరాఠి ఇలా ఎన్నో భాషలు ఉన్నాయి. కానీ వాళ్లందరికీ కామన్ గా అర్ధమయ్యే భాష హిందీ. అక్కడ మొత్తం కామన్ భాష గా ఉపయోగించేది హిందీనే.అలా సౌత్ లో ఎందుకు ఒక కామన్ భాష లేదు..?, నార్త్ ఇండియా మొత్తం ఎన్ని భాషలు ఉన్నా హిందీ కామన్ భాషగా ఉపయోగిస్తున్నప్పుడు మనం కూడా ఎందుకు కామన్ భాషగా హిందీ ని మాట్లాడకూడదు,హిందీని నేర్చుకోకూడదు?
చిన్నప్పుడు మనం స్కూల్ లో చదువుకునే రోజుల్లో కూడా హిందీ నేర్చుకున్నాం కదా,ఇప్పుడు ఆ బాషాని ఎవరైనా మాట్లాడితే ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు..?,బ్రిటిష్ వాళ్ళు ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ ని నేర్చుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు చేస్తాము, కానీ హిందీ అంటే ఎందుకు అంత చులకన..?, మన భారతీయ భాషని నేర్చుకోవడానికి ఎందుకు అంత నామోషీగా ఫీల్ అవుతాము..?.మన సౌత్ లో తెలుగు , తమిళం , కన్నడ మరియు మలయాళం భాషలు ఉన్నాయి.
తమిళ భాషకి చెందిన వాడు వచ్చి తెలుగు వాడితో మాట్లాడితే ఒక్క ముక్కైనా అర్థం అవుతుందా?, పోనీ కన్నడ భాషకి చెందిన వాడు మాట్లాడే భాష తెలుగు వాడికి అర్థం అవుతుందా..?, మన సౌత్ లో ఇప్పటికైనా ఒక్క కామన్ భాష ని వాడుతున్నామా..?, ఏమి మాట్లాడాలన్నా ఇంగ్లీష్ లో మాట్లాడాలి,నార్త్ ఇండియా లో ఉండేవాళ్ళకు అక్కడి వాళ్ళ మాతృ భాషతో పాటుగా హిందీ నేర్చుకున్నారు,ఇంగ్లీష్ కూడా అద్భుతంగా మాట్లాడగలరు. కానీ మనం మాత్రం మా భాష గొప్పది అంటే మా భాష గొప్పది అంటూ గొడవలేసుకుంటూ బాగా వెనుకపడ్డాము.
South India Vs North India
ఇకనైనా మారితే బాగుండును,రాజకీయ నాయకులు తమ స్వార్ధ పూరిత రాజకీయాల కోసం మాత కల్లోల సృష్టిస్తారు, బాషా భేదాలను కూడా పుట్టించి విడదీయాలని చూస్తారు.వాళ్ళ ట్రాప్ లో మనం పడిపోకూడదు,ప్రత్యేక పరిస్థితుల కారణం గా నార్త్ ఇండియా మరియు సౌత్ ఇండియా అని పిలుస్తారు, కానీ మన అందరం ఒక దేశానికీ చెందిన వాళ్ళమే, కాబట్టి మాతృబాషని ప్రేమించండి, కామన్ భాషగా హిందీ ని కూడా నేర్చుకోండి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Why is there so much language difference in south india it is a sin to speak in hindi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com