
Dil Raju: శాకుంతలం ప్రమోషనల్ ఈవెంట్లో గ్రేట్ ఆంధ్ర రిపోర్టర్ నిర్మాత దిల్ రాజుతో వాదనకు దిగారు. శాకుంతలం చిత్రాన్ని బాలీవుడ్లోనే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. సొంత పరిశ్రమ టాలీవుడ్ లో అంతగా ప్రమోట్ చేయడం లేదు. అలాగే బాలీవుడ్ మీడియా ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పే టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ తెలుగు మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఎందుకు స్పందించరు అని అడిగారు. ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెప్పాలని పట్టుబట్టారు.
దిల్ రాజు కలగజేసుకుని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఇది మన సొంత ఇల్లు. కొంచెం స్వేచ్ఛ ఉంటుంది. అదే సమయంలో ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది. నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చానంటే నెన్స్ట్ డే ఏదో ఒక పెంట నా దగ్గరకు వస్తుంది. ఎందుకు మాట్లాడానురా బాబు అని బాధపడతాను. అదే వేరే పరిశ్రమల్లో మనకు తక్కువ గుర్తింపు ఉంటుంది. అక్కడ ఏం మాట్లాడినా పెద్ద సెన్సేషన్ కాదు. అంతకు మించి పెద్ద కారణం ఏం లేదన్నారు.
దిల్ రాజు ప్రశ్నకు గ్రేట్ ఆంధ్రా రిపోర్టర్ సంతృప్తి చెందలేదు. మీరు బొమ్మరిల్లు ఫాదర్ లా సమంతను వెనకేసుకొస్తున్నారు. నేను ఆమెను అడిగానని అన్నాడు. దిల్ రాజు తో పాటు మిగతా పాత్రికేయులకు అది అతి అనిపించింది. ప్రముఖులు ఆచితూచి మాట్లాడతారు. కారణం తమ మాటలు ఏ ఏమాత్రం ద్వందార్థం తీసుకున్నా వివాదాస్పదం కావచ్చు. పబ్లిక్ ఫిగర్ కాబట్టి మీడియా ముందు చాలా కంట్రోల్ గా ఉంటారు. దాన్ని మీడియా ప్రతినిధులు అలుసుగా తీసుకుంటారు.

ఇక్కడ ప్రశ్న వేసినప్పుడు ఎవరో ఒకరు సమాధానం చెప్పారు. అది అంతటితో ముగిసింది. నేను అడిగిన వ్యక్తే సమాధానం చెప్పాలనడం హర్షించదగ్గ విషయం కాదు. దిల్ రాజు అప్పటికీ తనదైన శైలిలో చురకలు వేశాడు. సమంత ఫైనల్ గా ఆ ప్రశ్నకు స్పందించారు. నేను ఏ తెలుగు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా లేను. బాలీవుడ్ మీడియాతో నేను ఇంగ్లీషులో మాట్లాడతాను. తెలుగు కంటే అది ఈజీ కనుక అక్కడి మీడియాతో నా ఫ్లో బాగుంటుంది. అంతకు మించి ఎలాంటి వ్యత్యాసం లేదన్నారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది.