
Sperm: ఈ రోజుల్లో వంధ్యత్వం బాధిస్తోంది. సంతాన లేమి సమస్య వెంటాడుతోంది. చాలా మంది జంటలు సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదు. ఒక సంవత్సర కాలంలో ఎలాంటి నిరోధక చర్యలు పాటించకున్నా సంతానం కలగడం లేదంటే సంతానలేమిగానే చూడాలి. దీంతో వైద్యులను సంప్రదిస్తున్నారు. తమకు సంతాన యోగం ఉందో లేదో అని తెలుసుకుంటున్నారు. ఆ అవకాశం లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెడుతున్నారు. సంతాన భాగ్యం కావాలని ఆశపడుతున్నారు.
ఈ నేపథ్యంలో సంతాన సాఫల్యత కోసం ఇతరుల వీర్య కణాలతో కూడా సంతానం పొందొచ్చు. దీనికి దంపతుల అంగీకారం ఉంటే నేరుగా గర్భాశయంలోని వీర్యాన్ని ప్రవేశపెడతారు. దీంతో గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. దీనికి ఇటీవల కాలంలో ప్రాచుర్యం పెరుగుతోంది. సంతానం లేని భార్యాభర్తల పరస్పర అంగీకారంతో ఇతరుల వీర్యంతో సంతానాన్ని పొందే అవకాశాలు ఉంటున్నాయి.
దీనికి విదేశాల్లో సైతం మంచి గిరాకీ ఉంది. ఆ మధ్య ఓ వ్యక్తి తన వీర్యాన్ని పలుమార్లు దానం చేసినట్లు వార్తల్లో చదివాం. ఇలా మన దేశంలో కూడా స్పెర్మ్ ను దానం చేసే వారికి అవకాశాలు ఇస్తున్నారు. 18-39 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వారి నుంచి వీర్యాన్ని సేకరించి భద్రపరచి కావాల్సిన వారికి ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ వయసు వారైతేనే వారి వీర్యంలో కదలికలు బాగుంటాయనే ఉద్దేశంతో వారి వీర్యాన్ని తీసుకోవాలని చూస్తున్నారు. వీర్య కణాల్లో కదలికలు లేకుంటే అది ప్రయోజనం ఉండదు. అందుకే ఆ వయసులో ఉన్న వారి వీర్యంతోనే మంచి లాభాలు ఉంటాయనే ఉద్దేశంతో వారికి అవకాశం ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో సంతాన సాఫల్యత ఢోకా లేకుండా చేస్తున్నారు.

స్పెర్మ్ ను ఇచ్చే దాతలకు ముందే పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి వీర్యం పనికొచ్చేదిగా ఉంటే దాన్ని భద్రపరచి ఎవరైతే కావాలని అడుగుతారో వారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఇలా సంతాన లేమికి విరుగుడు కనిపెడుతున్నారు. ఫలితంగా ఎంతో మంది వేదనకు చెక్ పెడుతున్నారు. ఎలాగైతేనేమీ సంతానం కలిగేందుకు మార్గాలు దగ్గర చేస్తున్నారు. పెరిగిన సాంకేతికతతో ఇదంతా సాధ్యం అవుతోంది.