
Rajamouli- Allu Aravind: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి పేరు వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో మారుమోగుతోంది. ఇటీవల ఆయన డైరెక్షన్ చేసిన ఆర్ఆర్ఆర్ పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడమే కారణం. అంతేకాకుండా ఈ మూవీ ఆస్కార్ బరిలో కూడా ఉండడంతో జక్కన్న సంచలన డైరెక్టర్ గా మారిపోయాడు. ఇటీవల ఆయన హాలీవుడ్ డైరెక్టర్లతో కలిసి ఫొటోలకు ఫోజులివ్వడంతో ఆయన రేంజ్ హాలీవుడ్ స్థాయికి వెళ్లిందని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ తరుణంలో దర్శక ధీరుడి గురించి ఓ హాట్ టాపిక్ చక్కర్లు కొడుతోంది. ఆయనకు, అల్లు అరవింద్ కు మధ్య ఎక్కడో చెడిందని, అందుకే అల్లు అర్జున్ తో సినిమా తీయట్లేదనే ప్రచారం సాగుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని లాంటి చిన్న హీరోలతో సినిమా తీసిన రాజమౌళి స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. డేరింగ్ డాషింగ్ హీరోగా పేరున్న బన్నీని ‘పుష్ప’లో చూసి హాలీవుడ్ లెవల్లో నటించారని ప్రశంసిస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ రాజమౌళిలో కలిస్తే అల్లు అర్జున్ మరింత ఫేమస్ అవుతారని అంటున్నారు. అయితే జక్కన్న మాత్రం అందరికీ అవకాశం ఇస్తున్నా.. ఆయన విషయంలో మాత్రం ఆసక్తి చూపడం లేదని చర్చ పెడుతున్నారు. అందుకు ఓ కారణం ఉందట.
రాజమౌళి రామ్ చరణ్ తో కలిసి తీసిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ కంటే ముందు ‘మగధీర’ అని అందరికీ తెలుసు. ఈ సినిమా 2009లో బ్లాక్ బస్టర్. వసూళ్లలోనూ రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రానికి నిర్మాత అల్లు అరవింద్. ఈ సినిమా నిర్మాణ సమయంలో రాజమౌళి, అరవింద్ మధ్య చిన్న డిష్కర్షన్ జరిగిందట. మగధీర రిలీజ్ సమయంలో లెక్కల గురించి బయటకు చెప్పొద్దని నిర్మాత అరవింద్ ను రాజమౌళి కోరాడట. అలాగే దీనిని ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని చెప్పాడట. కానీ అల్లు అరవింద్ రాజమౌళి మాటను పట్టించుకోలేదట.

అప్పటి నుంచి రాజమౌళి, అల్లు అరవింద్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ఇండస్ట్రీలో టాక్. కానీ అలాంటిదేమీ లేదని కొందరు కొట్టి పారేస్తున్నారు. అయితే రాజమౌళి సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అందరితో సినిమాలు తీస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ను ఎందుకు పట్టించుకోవడం లేదని కొందరు అంటున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలే అందుకు కారణమని అంటున్నారు. మరి ఈ వార్తల నేపథ్యంలో అల్లు అరవింద్ ఎలా స్పందిస్తారోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.