
Chandrababu Troll: “జొన్న కలి, జొన్న యంబలి
జొన్నన్నము, జొన్న పిసరు, జొన్న లె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకున్”
అని మహాకవి శ్రీనాధుడు (1365- 1441) ఆరు దశాబ్దాల క్రితమే ఆంధ్ర ప్రాంత ఆహారం గురించి రాశారు. 11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణ ప్రాంతంలో వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలకు ప్రసిద్ధి. ప్రపంచానికి తొలి వాటర్షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన ఘనత తెలంగాణ ప్రాంతానిది. అప్పట్లోనే విష్ణు కుండినుల నుంచి కాకతీయులు, ఆ తదుపరి నిజాములదాకా గొలుసుకట్టు చెరువుల నిర్మాణంతో వ్యవసాయ అభివృద్ధికి బాటలు వేశారు. 15వ శతాబ్దం నుంచే హైదరాబాద్ దమ్ బిర్యాని కి ప్రసిద్ధి. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఖ్యాతి ఒడిసేది కాదు. కానీ ఇవేవీ తెలియని చంద్రబాబు నేనే హైదరాబాద్ ను నిర్మించానని గొప్పలు పోతున్నాడు. అంతటి గొప్పవాడు అయితే అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఐదేళ్లు ఎందుకు నాన్చాడు. హైదరాబాదులో ప్రపంచ పటంలో పెట్టినవాడైతే సొంత రాష్ట్రంలో కనీసం శాశ్వత సచివాలయాన్ని ఎందుకు నిర్మించుకోలేకపోయాడు. ఒక చంద్రబాబేనా? ఆయన బామ్మర్ది బాలయ్య, కొడుకు లోకేష్ కూడా తెలంగాణపై బోలెడు సార్లు నోరు పారేసుకున్నారు. మావి నాలుకలు కావని, తాటి మట్టలని వాళ్లకు వాళ్లే నిరూపించుకున్నారు. తెలంగాణ వచ్చినందుకు కాదు, ఇలాంటి బేకర్ గాళ్ళను వదిలించుకున్నందుకు తెలంగాణ సమాజం సంతోషిస్తున్నది. మళ్లీ మళ్లీ అవే కూతలు, రాగులు, సజ్జలు, జొన్నలు తిని బతికే తెలంగాణ జనం ఎన్టీఆర్ రెండు రూపాయల బియ్యం ఇచ్చాకే అన్నం తిన్నదట.. ఒక రాజకీయ నాయకుడు తన గొప్ప గురించి చెప్పుకోవడం సర్వసాధారణం.. కానీ ఒక జాతిని అవమానించడం, మేం వచ్చాకే మీరు సంస్కృతి నేర్చుకున్నారని చెప్పటం పూర్తి అనైతికం.

అంటే ఈ లెక్కన చంద్రబాబు పుట్టినప్పుడు ఆయన ఇంట్లో తెల్లవారే చికెన్ దమ్ బిర్యానీ వండే వాళ్ళా? మధ్యాహ్నం సన్నన్నంతో, రాత్రి మటన్ బిర్యానీ తో చంద్రబాబు కడుపు నింపే వాళ్ళా? కేవలం వాళ్లు మాత్రమే తినడం కాదు ఊరు మొత్తానికి అన్నదానం చేసే వాళ్ళా? ఎందుకు బాబూ మా బతుకు మేము బతుకుతాం అని తరిమేసినా కూడా, ఈ తెలంగాణ మీద పడి ఏడవటం?
అసలు ఆంధ్రులు వచ్చాకే తెలంగాణ సమాజం బట్టకట్టింది అన్న రేంజ్ లో చంద్రబాబు, నాయకులు మాట్లాడుతున్న తీరు పూర్తి అబ్సర్డ్.. అసలు ఎన్టీఆర్ వచ్చేవరకు తెలంగాణ ప్రాంత ప్రజలు అండమాన్ గుహల్లో ఉండే వాళ్ళా? సెంటినలీస్ తెగల వాళ్ళ మాదిరిగా బతికే వాళ్ళా? నాగరికులుగా ఉండే ఆంధ్రులను చూసి భయంతో దాక్కునే వాళ్ళా? చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఇలాగే అనిపిస్తోంది.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పటికీ…మీరూ వద్దు, మీ సోపతి వద్దు, నువ్వు అయ్యో నీవా, అవ్వోనివా అంటూ వెళ్లగొట్టినా సరే… ఎనిమిదేళ్లయినా ఒక చిన్న రాజధాని కట్టుకునే దిక్కులేదు. ఈరోజుకు తెలంగాణ మీద పడి తింటూ, తెలంగాణ మీదే ఏడుపు.. ఇదే చంద్రబాబు, ఇదే లోకేష్ ఈరోజుకూ బియ్యమే తినేది. ఎవడి తిండి తింటే వాడినే తిట్టిపోయడం కదా వీళ్లు నేర్పే మర్యాద. తెలంగాణ అంటే ఈరోజుకూ అదే వెక్కిరింపు.. అదే హేళన… వరి బియ్యం ఇవ్వడమే కాదు, వండుకోవడం తెలియకపోతే ఎన్టీఆరే ఊరు రా క్యాంపులు పెట్టి, అన్నం ఎలా వండుకోవాలో నేర్పించినట్టు ఉన్నాడు.. పాపం చంద్రబాబుకు మతిభ్రమించినట్టుంది. అందుకే తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు.. తెలంగాణకు మేము ఇది చేశాం అది చేశాం అని గొప్పలు చెప్పే బదులు.. ఆ తెలంగాణలోనే ఉన్న ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒక్కసారి చూపించుకోవచ్చు కదా.. కళ్ళకు పట్టిన ఆ పచ్చకామెర్లు మొత్తం తొలగిపోతాయి. చుట్టూ పరచుకున్న ఆ భ్రమలు మొత్తం వీడిపోతాయి.