Ranveer Singh : దక్షిణాది సినిమాలు ఆడుతున్నాయి.. బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఆడట్లేదు? రణ్ వీర్ ప్రశ్నకు టాటా చైర్మన్ ఆసక్తికరమైన సమాధానం!

Ranveer Singh : ఒక బాహుబలి.. ఒక కేజీఎఫ్.. పుష్ప.. ఆర్ఆర్ఆర్..  ఇలా దక్షిణాది నుంచి విడుదలై దేశాన్ని షేక్ చేసిన మూవీలు ఇవీ.. బాలీవుడ్ సినిమా విలపిస్తున్న వేళ.. దక్షిణాది సినిమాల వైభవం కొనసాగుతోంది. హిందీ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుంటే.. మంచి కంటెంట్ తో వస్తున్న సౌత్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఎంత బట్టలు చింపుకున్నా సరే.. హిందీ సినిమాలు ఆడడం లేదు. ఫుల్ ఫాంలో ఉండి.. ఒకప్పుడు హిందీ సినిమాలను ఏలిన అగ్ర […]

Written By: NARESH, Updated On : July 27, 2022 8:30 pm
Follow us on

Ranveer Singh : ఒక బాహుబలి.. ఒక కేజీఎఫ్.. పుష్ప.. ఆర్ఆర్ఆర్..  ఇలా దక్షిణాది నుంచి విడుదలై దేశాన్ని షేక్ చేసిన మూవీలు ఇవీ.. బాలీవుడ్ సినిమా విలపిస్తున్న వేళ.. దక్షిణాది సినిమాల వైభవం కొనసాగుతోంది. హిందీ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుంటే.. మంచి కంటెంట్ తో వస్తున్న సౌత్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఎంత బట్టలు చింపుకున్నా సరే.. హిందీ సినిమాలు ఆడడం లేదు.

ఫుల్ ఫాంలో ఉండి.. ఒకప్పుడు హిందీ సినిమాలను ఏలిన అగ్ర హీరో రణ్ వీర్ సింగ్ సైతం హిందీ సినిమాలకు ఈ దుస్థితిపై భోరుమన్నాడు. తన సినిమాలు ఆడడం లేదని ఆవేదన చెందాడు. తాజాగా ‘ఐఏఏ లీడర్ షిప్ అవార్డుల కార్యక్రమంలో రణ్ వీర్ చేసిన వ్యాఖ్యలు హిందీ సినిమాల దుస్థితికి అద్దం పడుతున్నాయి.

టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ , బాలీవుడ్ అగ్రహీరో రణ్ వీర్ సింగ్ పాల్గొన్న ఈ సమావేశంలో ఈ ప్రశ్ననే ఇప్పుడు హైలెట్ అయ్యింది. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ ను ఒక సూటి ప్రశ్న అడిగాడు రణ్ వీర్ సింగ్. వేదికపై అందరి ముందే తనలోని ఆవేదనను కళ్లకు కట్టాడు. ‘నాకెంతో ఇష్టమైన హిందీ సినిమాలు ఆడడం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోవడం లేదు. కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. హిందీ సినిమాలు ఫ్లాప్ కావడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి ఎవరి వద్ద సమాధానం లేదు. సినిమా పెద్దలు గందరగోళంలో ఉన్నారు. ప్రేక్షకులు దక్షిణాది సినిమాలను ఆదరిస్తున్నారు. యాక్షన్ చిత్రాలను చూస్తున్నారు. హిందీ సినిమా పతనానికి కారణం ఏంటి సార్’ అంటూ బేలగా టాటా చైర్మన్ ను రణ్ వీర్ సింగ్ అడగడం చర్చనీయాంశమైంది.

దీనికి టాటా గ్రూప్ చైర్మన్ సమాధానమిచ్చాడు. సినిమా పరిశ్రమపై నాకున్న జ్ఞానం శూన్యం.. ఏదన్నా అభిప్రాయం ఉన్నా అది కూడా కాస్తా ప్రతికూలంగానే ఉంది’ అంటూ రణ్ వీర్ ప్రశ్నకు టాటా గ్రూప్ చైర్మన్ దాటవేశాడు. సినిమాలు ఎందుకు ఆడడం లేదన్నది తనకు తెలియదు అంటూ టాటా చైర్మన్ పేర్కొన్నాడు.

ఇదీ కేవలం రణ్ వీర్ సింగ్ ఒక్కడి పరిస్థితి మాత్రమే కాదు.. బాలీవుడ్ ను ఒకప్పుడు ఏలిన అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లు సహా ఎంతో మంది హీరోలది. కంటెంట్ లేకుండా మూసధోరణితో కోట్లు పెట్టి తీస్తున్న వీరి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సినిమాలు కూడా ఆడడం లేదంటే హిందీ జనాలు ఎంతగా విసిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. వారి అభిరుచికి తగ్గట్టుగా సినిమాలను బాలీవుడ్ రూపొందించడం లేదన్నది వాస్తవం. అదే ప్రధాన లోపం..

పుష్ప సినిమాలో బన్నీ పాత్ర మన సమాజంలోని ఒక లారీ డ్రైవర్ పాత్రకు దగ్గరంగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో పౌరుషాలు, పంతాలకు నిలువుటద్దంగా కనిపిస్తుంది. అలాంటి పాత్రలు, చిత్రణలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అందుకే హిందీ జనాలు వారి హిందీ హీరోల హంగు ఆర్బాటాల సినిమాలను తిరస్కరించి మన ‘పుష్పరాజ్’ను గుండెల్లో పెట్టుకున్నారు. ‘తగ్గేదేలే’ అంటూ దేశవ్యాప్తంగా వైరల్ చేశారు.

కరోనా తర్వాత ఓటీటీల ప్రభావంతో జనాల దృష్టికోణం మారింది. హాలీవుడ్ సహా విభిన్నమైన కంటెంట్ చూసేసరికి ప్రేక్షకుల్లోనూ మార్పు వచ్చింది. దానికి తగ్గట్టుగా తెలుగు సహా దక్షిణాది సినిమాలు అప్డేట్ అయినా.. హిందీ సినిమా మాత్రం కాలేదు. అదే వారి వైఫల్యానికి కారణంగా చెప్పొచ్చు. అవే పాత చింతకాయపచ్చడి రొట్టకొట్టుడు మూసధోరణి సినిమాలు చేస్తున్న బాలీవుడ్ హీరోలు ఇప్పుడు తమ కంటెంట్ జనాలకు నచ్చడం లేదని విలపిస్తున్నారు. దక్షిణాది వారిలాగా క్రియేటివ్ గా ఆలోచించడం లేదు. సినిమాలు తీయడం లేదు. ఎంత సేపు దక్షిణాది సినిమాలపై ఇలా ఏడ్చే బదులు మంచి క్రియేటివ్ కంటెంట్ ను క్రియేట్ చేస్తే ఈ బాలీవుడ్ కు ఈ పరిస్థితి ఉండేది కాదన్నది నిపుణుల సలహా.