Homeక్రీడలుVirat Kohli Cars: కార్లు అమ్మేసిన స్టార్‌ క్రికెటర్‌.. కారణం చెప్పిన విరాట్‌!

Virat Kohli Cars: కార్లు అమ్మేసిన స్టార్‌ క్రికెటర్‌.. కారణం చెప్పిన విరాట్‌!

Virat Kohli Cars
Virat Kohli Cars

Virat Kohli Cars: ఐపీఎల్‌ సీజన్‌ 16 మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్‌లో సీనియర్‌ జట్టు రాయల్‌ చాలెంజ్‌ బెంగళూరు(ఆర్‌సీబీ). ఈ జట్టు గత 15ను సీజన్లలో ఒక్కసారి కూడా కప్‌ గెలవలేదు. అయినా ఆ జట్లు క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం విరాట్‌ కోహ్లీ. 15 సీజన్లు ఆర్‌సీబీ తరఫున ఆడిన ఏకైక ఆటగాడిగా విరాట్‌ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ సీజన్‌ 16 ప్రారంభానికి ముందు విరాట్‌ కొన్ని ఆసక్తికర సన్నివేశాలను అభిమానులతో పంచుకున్నాడు.

కార్లంటే విపరీతమైన ఇష్టం..
ఐపీఎల్‌ 16వ సీజన్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్‌ బ్యాటర్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ కొత్త టాటూతో కనువిందు చేయబోతున్నాడు. మరోవైపు తనకు కార్లంటే విపరీతమైన ఇష్టమని, ఒకప్పుడు చాలా కార్లు తన గ్యారేజీలో ఉండేవని తెలిపాడు. అయితే వాటిలో కొన్నింటిని అమ్మేసినట్లు చెప్పాడు. ఇప్పుడు కేవలం అవసరమైన కార్లను మాత్రమే ఉంచుకున్నానని, వాటిలోనే ప్రయాణిస్తున్నట్లు తెలిపాడు. ఇదంతా ఆర్‌సీబీ ఫొటో షూట్‌ సందర్భంగా చిట్‌చాట్‌లో వెల్లడించాడు. బోల్డ్‌ డైరీస్‌ పేరిట ఆర్‌సీబీ ఓ వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

వ్యాఖ్యాత: అప్పటికప్పుడు అనుకుని కొనుగోలు చేసి.. ఉపయోగించని వస్తువులు ఏవైనా ఉన్నాయా..?

విరాట్‌: హఠాత్తుగా చూడగానే కొనుగోలు చేసిన వాటిల్లో ఎక్కువగా కార్లు ఉండేవి. చాలా వరకు అప్పటికప్పుడు కొన్నవే. అయితే వాటిల్లో ప్రయాణించడం చాలా తక్కువ. ఒకానొక సమయంలో ఇది సరికాదని భావించి చాలా కార్లను అమ్మేశా. ఇప్పుడు మాకు అవసరం అనుకున్న వాటిని ఉంచుకుని.. అందులోనే ప్రయాణిస్తున్నాం. ఇదంతా మానసికంగా పరిణతి సాధించడం వల్లే సాధ్యమైంది. ప్రతీ విషయంపైనా అవగాహన తెచ్చుకుని పరిణతితో ఆలోచిస్తున్నా. ప్రాక్టికల్‌గా మనకు ఏమి అవసరమో తెలుసుకోవాలి.

వ్యాఖ్యాత: ఒకవేళ క్రిస్టియానో రొనాల్లో, రోజర్‌ ఫెదరర్, నువ్వు ఒకే టేబుల్‌ వద్ద కూర్చుంటే.. మీ మధ్య సంభాషణ దేని గురించి ఉంటుంది..?

Virat Kohli Cars
Virat Kohli Cars

విరాట్‌: నేను నిశ్శబ్దంగా కూర్చుని.. వారిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాను. నిజం చెప్పాలంటే ఏం మాట్లాడతానో కూడా తెలియదు. క్రీడా ప్రపంచంలో దిగ్గజ అథ్లెట్లను కలవడం అద్భుతంగా ఉంటుంది. అలాంటి వారి మాటలను విన్నా సరిపోతుంది. అని సమాధానం ఇచ్చాడు కోహ్లీ.

క్రికెట్‌ రారాజుగా ఎదిగిన కోహ్లీ.. తనను తాను ఎప్పుడూ కింగ్‌గా భావించడం లేదు. సామాన్య క్రికెటర్‌గానే ఉంటాడు. చిట్‌చాట్‌లో కోహ్లీ అథ్లెట్ల గురించి చెప్పిన సమాధానానికి విరాట్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు. క్రీడా స్ఫూర్తి అంటే ఇది అని కొందరు.. క్రికెట్‌ కింగ్‌ నువ్వు అంటు మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular