https://oktelugu.com/

Ammoru Movie Story: ‘అమ్మోరు’ షూటింగ్ అయిపోయాక విలన్ తొలగింపు.. చిన్నా ప్లేసులో రాంరెడ్డి ఎందుకొచ్చాడు?

Ammoru Movie Story:మల్లెమాల ప్రొడక్షన్స్ అని పెట్టి బుల్లితెరపై ఎంటర్ టైన్ మెంట్ ను పంచుతున్న నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి అంతకుమందు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. ముఖ్యంగా హర్రర్, మంత్రాలు, తంత్రాలకు సంబంధించిన మంచి కథలను తీసుకొని ప్రేక్షకులను మెప్పించి హిట్ కొట్టారు. అయితే కొద్దికాలంగా సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నారు. బుల్లితెరపై షోలకే పరిమితం అయ్యారు. 1989లో ఎంఎస్ ఆర్ట్స్ బ్యానర్ ను నిర్మాతగా శ్యాంప్రసాద్ రెడ్డి స్టార్ట్ చేశాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2022 / 06:49 PM IST

    Ammoru Movie Story

    Follow us on

    Ammoru Movie Story:మల్లెమాల ప్రొడక్షన్స్ అని పెట్టి బుల్లితెరపై ఎంటర్ టైన్ మెంట్ ను పంచుతున్న నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి అంతకుమందు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. ముఖ్యంగా హర్రర్, మంత్రాలు, తంత్రాలకు సంబంధించిన మంచి కథలను తీసుకొని ప్రేక్షకులను మెప్పించి హిట్ కొట్టారు. అయితే కొద్దికాలంగా సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నారు. బుల్లితెరపై షోలకే పరిమితం అయ్యారు.

    ammoru

    1989లో ఎంఎస్ ఆర్ట్స్ బ్యానర్ ను నిర్మాతగా శ్యాంప్రసాద్ రెడ్డి స్టార్ట్ చేశాడు. కోడిరామకృష్ణ దర్శకత్వంలో ‘అంకుశం’ సినిమా తీశాడు. అది ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత 1991లో ‘ఆగ్రహం’ సినిమా తీయగా అది ఫెయిల్ అయ్యింది. దీంతో నిరాశతో కొద్దిరోజులు విదేశాలకు వెళ్లిపోయాడు.

    అమెరికాలో గ్రాఫిక్స్ తో తీసిన ఇంగ్లీష్ మూవీలను చూసి శ్యాంప్రసాద్ రెడ్డి స్ఫూర్తి పొందాడు. గ్రాఫిక్స్ తో తెలుగు సినిమాలు తీయవచ్చు కదా? అని ఇండియాకు వచ్చి యూనిట్ సభ్యులతో చర్చించి ‘అమ్మోరు’ కథ రాయించాడు. కోదండరామిరెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న ‘రామారావు’ను అమ్మోరు సినిమాకి దర్శకుడిగా ఎంపిక చేశారు. ఈ కథ విన్న బాబు మోహన్ ‘సౌందర్య’ అయితే ఈ పాత్రకు సూట్ అవుతుందని శ్యాంప్రసాద్ రెడ్డికి సూచించాడు. దీంతో ఆమెను ఎంపిక చేశారు. రమ్యకృష్ణను ‘అమ్మోరు’ పాత్రకు ఎంపిక చేశారు.

    హీరోగా సురేష్ ను తీసుకొని విలన్ గా ‘చిన్నా’ను అనుకొని 1992లో షూటింగ్ మొదలుపెట్టి 18 నెలల పాటు చేసి పూర్తి చేశారు. అనంతరం షూటింగ్ ఫుటేజ్ తీసుకొని శ్యాంప్రసాద్ రెడ్డి విదేశాలకు వెళ్లాడు. అక్కడ గ్రాఫిక్స్ కు అనుగుణంగా సినిమా రాకపోవడంతో శ్యాంప్రసాద్ రెడ్డి ఇండియాకు వచ్చి ఆ ఫుటేజ్ మొత్తం మూలకు పడేశాడు. తిరిగి దర్శకుడు రామారావు స్థానంలో కోడి రామకృష్ణను తీసుకొని ‘అమ్మోరు’ సినిమా మళ్లీ మొదటి నుంచి తీశారు.

    ఇక ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. విలన్ పాత్ర చేసిన చిన్నా స్థానంలో ‘రాంరెడ్డి’ని తీసుకున్నారు. శ్యాం ప్రసాద్ రెడ్డి ఇక విదేశాలకు వెళ్లకుండా లండన్ నుంచి ఇండియాకు వచ్చిన ‘క్రిస్’ తో ఒక సంవత్సర కాలం పాటు ఆమ్మోరు సినిమాను పనిచేయించారు. దాదాపు 270 రోజుల పాటు షూటింగ్ చేసి సినిమాకు గ్రాఫిక్ వర్క్ అద్భుతంగా క్రిస్ చేయడంతో అమ్మోరుసినిమా 1995 నవంబర్ 23న విడుదల చేశారు. అది సంచలన విజయాన్ని అందుకొని టాలీవుడ్ చరిత్రలో మరుపురాని చిత్రంగా నిలిచింది.

    1992లో మొదలైన అమ్మోరు అలా దర్శకుడు, విలన్ మారి 1995లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కోసం శ్యాంప్రసాద్ రెడ్డి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు..