https://oktelugu.com/

హిట్ సినిమాలు పవన్‌ కళ్యాణ్ ఎందుకు వదలుకున్నాడు?

పవన్‌ కల్యాణ్‌.. అన్నయ్య చిరంజీవి వారసత్వాన్ని తీసుకొని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తక్కువ టైంలోనే పవర్‌‌ స్టార్‌‌ స్థాయికి ఎదిగాడు. యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు. అయితే.. మొదట్లో అన్నీ హిట్‌ సినిమాలే తీసిన పవన్‌.. ఆ తర్వాత మధ్యలో కొన్ని సినిమాలతో ఫ్లాప్‌లు అందుకున్నాడు. అయితే.. పవన్‌ చేతికి వచ్చిన కొన్ని హిట్‌ సినిమాలను కూడా ఆయన వదిలేసుకున్నారట. Also Read: ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సెట్‌లోకి సీత! ఇడియట్‌’, ‘అతడు’, ‘నేనింతే’.. ఈ సినిమా కథలన్నీ ముందుగా దర్శకులు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2020 / 02:32 PM IST
    Follow us on

    పవన్‌ కల్యాణ్‌.. అన్నయ్య చిరంజీవి వారసత్వాన్ని తీసుకొని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తక్కువ టైంలోనే పవర్‌‌ స్టార్‌‌ స్థాయికి ఎదిగాడు. యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు. అయితే.. మొదట్లో అన్నీ హిట్‌ సినిమాలే తీసిన పవన్‌.. ఆ తర్వాత మధ్యలో కొన్ని సినిమాలతో ఫ్లాప్‌లు అందుకున్నాడు. అయితే.. పవన్‌ చేతికి వచ్చిన కొన్ని హిట్‌ సినిమాలను కూడా ఆయన వదిలేసుకున్నారట.

    Also Read: ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సెట్‌లోకి సీత!

    ఇడియట్‌’, ‘అతడు’, ‘నేనింతే’.. ఈ సినిమా కథలన్నీ ముందుగా దర్శకులు పవన్‌ కోసం సిద్ధం చేసినవేనట. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టులను పవన్ వదులుకోవాల్సి వచ్చింది. అలాగే పవన్‌ మరికొన్ని సినిమాలు కూడా సెట్స్‌పైకి తీసుకొద్దామని భావించి వదిలేశారు. వాటిలో ‘సత్యాగ్రహి’, ‘కోబలి’ ముఖ్యమైనవి. ‘అజ్ఞాతవాసి’ తర్వాత త్రివిక్రమ్‌ తెరకెక్కిద్దామనుకున్న ‘కోబలి’ భవిష్యత్తులో తెరకెక్కే అవకాశం ఉంది. పవన్‌తో బండ్ల గణేష్‌తో తీసే సినిమా ‘కోబలి’ ప్రాజెక్టే అని ప్రచారం జరుగుతోంది.

    అయితే.. సత్యాగ్రహికి మాత్రం బ్రేక్‌ పడినట్లేనని తెలుస్తోంది. ఎందుకంటే ‘సత్యాగ్రహి’ని చాలా ఏళ్ల క్రితమే సెట్స్‌పైకి తీసుకెళ్లి ఆ తర్వాత ఆపేశారట పవన్‌. దీనికి గల కారణాలను కూడా పవన్‌ వివరించారు.

    Also Read: షాకిచ్చిన పునర్నవి.. ఇలా చేస్తుందని అనుకోలేదు.!

    ‘చాలా సంవత్సరాల క్రితమే ‘సత్యాగ్రహి’ని మొదలుపెట్టాను. ఆ చిత్ర పోస్టర్‌లో ఓవైపు లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణన్, మరోవైపు చెగువేరా చిత్రాలను పెట్టాను. ఇప్పుడు నా నిజ జీవితంలో ఏం చేస్తున్నానో అదే ఆ చిత్ర కథ. సినిమాల్లో పోరాటం చేసినంత మాత్రాన బయట పనులు జరగడం కష్టం. అందుకే సినిమాలతో పోరాటం చేయడం ఇష్టం లేక రాజకీయాల్లోకి వచ్చాను. ఆ సినిమా ఆపేసినప్పుడు నన్ను చాలా మంది తిట్టారు. కానీ ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నందున దాన్ని వదులుకోక తప్పలేదు’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఏది ఏమైనా పవన్‌ అంత మంచి హిట్‌ సినిమాలను వదులుకోవడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.