Interesting secrets: మద్యం బాటిళ్లు డార్క్ కలర్లోనే ఎందుకు ఉంటాయి..? ‘గూస్ బంప్స్’ అంటే ఏమిటి..?

Interesting secrets: మన కళ్లముందే అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటికి కారణాలు మాత్రం తెలియవు. పెద్దలను అనుసరిస్తూ చూస్తూ ఉండిపోతాం. అయితే కొందరు మాత్రం వాటికి కారణాలు తెలుసుకొని పుస్తకాలు రాశారు. ఇంకొందరు వాటిని డిజిటలైజ్ చేసి సోషల్ మీడియాలో ఉంచారు. పాలు ఎందుకు పొంగుతాయి..? మనుషులు కోమాల్లోకి ఎందుకు వెళ్తారు..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం కావాలంటే కింద చదవండి.. మనుషులు ఎక్కువగా కోమాల్లోకి వెళ్లారని వింటూ ఉంటాం. కోమా అనుపదం గ్రీకు నుండి […]

Written By: NARESH, Updated On : November 16, 2021 12:50 pm
Follow us on

Interesting secrets: మన కళ్లముందే అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటికి కారణాలు మాత్రం తెలియవు. పెద్దలను అనుసరిస్తూ చూస్తూ ఉండిపోతాం. అయితే కొందరు మాత్రం వాటికి కారణాలు తెలుసుకొని పుస్తకాలు రాశారు. ఇంకొందరు వాటిని డిజిటలైజ్ చేసి సోషల్ మీడియాలో ఉంచారు. పాలు ఎందుకు పొంగుతాయి..? మనుషులు కోమాల్లోకి ఎందుకు వెళ్తారు..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం కావాలంటే కింద చదవండి..

Liquor-Bottles-

మనుషులు ఎక్కువగా కోమాల్లోకి వెళ్లారని వింటూ ఉంటాం. కోమా అనుపదం గ్రీకు నుండి పుట్టింది. కోమా అంటే డీప్ స్లీప్ అని అర్థం. అయితే నిద్రకు, కోమాకు చాలా తేడా ఉంది. నిద్రలో ఉన్న వ్యక్తి శబ్దం వినగానే లేస్తాడు. కానీ కోమాల్లో ఉన్న వ్యక్తి ఎన్ని రకాల శబ్దాలు విన్నా అలికిడి ఉండదు. మొత్తంగా కోమాల్లోక వెళ్లడమేంటే బ్రెన్ కాసేపు ఆగిపోవడం అని అర్థం. బ్రెయిన్లోని ‘రెట్యుకులర్ అక్డివేటింగ్ సిస్టమ్’ నిద్రకు, మెళకువకు మధ్య ఉండే స్విచ్ లాంటిది. ఇది మెదడుకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఈ సిస్టమ్ ఆగిపోతే మనిసి కోమాల్లోకి వెళ్తాడు. అమెరికాకు చెందిన ఎడ్వర్డా ఒబారా అనే మహిళ 42 సంవత్సరాలు కోమాల్లో ఉంది.

పాలను వేడిచేసినప్పుడు అవి పొంగి కిందపోతాయి. కానీ నీటినివేడిచేసినప్పుడు అలా జరగదు. మరి పాలు ఎందుకు పోతాయి.. నీళ్లు ఎందుకు పోవు. నీటిని వేడి చేసినప్పుడు నీరు ఇవిరి రూపంలో మారి పైకి పోతుంది. కానీ పాలలో నీటితో పాటు ఇతర పదార్థాలు ఉంటాయి. పాలల్లో 87 శాతం నీళ్లు ఉంటే మిగిలిన 13 శాతం ప్రొటీన్లు, ప్యాడ్స్ ఉంటాయి. పాలను వేడి చేసినప్పడు నీటి నుంచి ప్రొటీన్లు, ప్యాడ్స్ విడిపోతాయి. ఇవి నీట కన్నా తేలికగా ఉండడంతో పైకి తేలుతాయి. దీంతో అవి నీటిని కప్పబడుతాయి. పాలను వేడి చేసినప్పుడు అందులో ఉండే నీరు ఆవిరవ్వడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ నీటిపై ఉండే పాల లేయర్ పైకి వెళ్లనివ్వదు. అలా ఎక్కు వేడి అయినప్పుడు ఆ లేయర్ పొరను నీరు పైకి లేపుతుంది. అప్పుడు పాలు పొంగాయని అంటుంటాం. అయితే పాలు పొంగకుండా గరిటెతో తిప్పుతుంటారు. ఇలా చేయడం వల్ల పై పొరకు రంధ్రం ఏర్పడి నీటి ఆవిరి పైకి పోయేలా చేస్తుంది. దీంతో పాలు పొంగకుండా ఉంటాయి.

అల్కహాలు ఉండే బాటిళ్లు ఎక్కువగా గ్రీన్, బ్రౌన్ కలర్లోనే ఎందుకు ఉంటాయి..? అంటే బాటిల్లో ఉండే అల్కహాల్ సూర్య రశ్మినుంచి వెలువడే లైట్ తో పాటు యూబిరేస్ అల్కహాల్ కు తగిలితే అందులో ఉండే ఆసిడ్స్ విచ్ఛిన్నమవుతాయి. అప్పటికే ఆల్కహాల్ లో సల్ఫర్ ఉంటుంది. దీంతో అది కలిసిపోవడం వల్ల చెడు వాసన వస్తుంది. అయితే బ్రౌన్, గ్రీన్ బాటిళ్లు సూర్యరశ్మిని ఎక్కువగా లోపలికి వెళ్లకుండా ఆపుతాయి. అల్కహాల్ మాత్రమే కాకుండా కొన్ని మెడిసిన్స్ కూడా ఇలా డార్క్ కలర్లోనే ఉంటాయి. ఎందుకంటే సూర్యరశ్మి అందులోకి వెళ్తే అవి పాడవుతాయి.

కాపీ రైట్ అనే పదం చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ కాపీ లెఫ్ట్ గురించి చాలా మందికి తెలియదు. యూట్యూబ్ లో ఏదైనా వీడియో కాపీ కొడితే ‘సీ’ మోడల్ ఉండే సిగ్నల్ వస్తుంది. కాపీ రైట్ అంటే ఒక బుక్ లోని పొయేమ్ గానీ, వీడియో గానీ ఇతరులు తీసుకోకుండా దాని ఓనర్ కాపీరైట్ విధిస్తాడు. అతని పర్మిషన్ లేకుండా వాటిని తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాపీ రైట్ అంటే ఎవరూ ఉపయోగించరాదని అర్థం. కానీ కాపీ లెప్ట్ అంటే దానిని అందరూ వాడుకోవచ్చు అని అర్థం. ఉదాహరణకు ఒక మ్యూజిక్ సాంగ్ కు కాపీ లెప్ట్ అని ఉంటే దానిని ఉచితంగా అందుబాటులో ఉంచారని అర్థం.

గూస్ బంప్స్: ఈ పదం సోషల్ మీడియాలో ఎక్కువగా వింటూంటాం. కానీ ఈ పదం అర్థం చాలా మందికి తెలియదు. మనం ఎదైనా భయంకర, ఆశ్చర్యకర సన్నివేశాలు చూసినా.. విన్నా.. మన చేతిపై ఉన్న రోమాలు నొక్కబొడుస్తాయి. అయితే ఆ పేరు ఎలా వచ్చిందంటే.. చికెన్ వండేటప్పుడు కోడిపై ఉన్న ఈకలు పీకేసినప్పుడు దానిపై బొబ్బల్లాగా ఏర్పడుతాయి. దీనిని గూస్ బంప్స్ అంటారు. చర్మం మీద ఉండే వెంట్రుకలకు లోపన ఎరక్టర్ అనే కండరంతో కలయిక ఉంటుంది.ఈ కండరాలు సంకోసించినప్పుడు చర్మం దగ్గరికివచ్చి వెంట్రుకలు పైకి లేస్తాయి. ఇలా పైకి లేచినప్పుడ చర్మంపై చిన్న చిన్న ఏర్పడే చిన్న చిన్నొ బొబ్బలను గూస్ బంప్స్ అంటారు.