
Heart Attack Reason: ఇటీవల కాలంలో ఆరోగ్య సమస్యలు అందరిని వేధిస్తున్నాయి. మారుతున్న జీవనశైలితో చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు బాధిస్తున్నాయి. దీంతో జీవితాంతం మందులు వాడుతూ తిప్పలు పడుతున్నారు. దీనికి కారణం మన ఆహార అలవాట్లే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మనం తినే ఆహారాలే మనకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. కడుపుకు ఇంపుగా ఉంటున్నాయని ఏది పడితే అది తింటూ కడుపును కీకారణ్యంగా చేసుకుంటున్నారు. తిన్న పదార్థాలు జీర్ణం కాక సమస్యల్లో చిక్కుకుంటున్నారు.
నలభై ఏళ్లు దాటిన తరువాత గుండె జబ్బుల ముప్పు ఏర్పడుతోంది. దీనికి ప్రధాన కారణం మన ఆహారాలే కావడంతో వాటిలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తెల్ల అన్నంతో అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా మానడం లేదు. మూడు పూటలు అన్నం తింటుండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా మధుమేహం దాడి చేస్తోంది. షుగర్ తో పాటు బీపీ కూడా వెన్నంటే ఉంటోంది. ఇలా జబ్బుల బారిన పడటంతో మనకు గుండె జబ్బుల ముప్పు కూడా పొంచి ఉంటోంది.
మన ఆహార అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అన్నంకు బదులుగా తృణ ధాన్యాలు అరికలు, ఊదలు, సామలు, కొర్రలు, అండుకొర్రలు తీసుకోవడం మంచిది. వీటితో మనకు పోషకాలు మెండుగా లభిస్తాయి. అందరు టీ ఓ అలవాటుగా మార్చుకున్నారు. టీకంటే అంబలి తాగితే ఎన్నో రెట్లు ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కానీ మనం టీకే ఆకర్షితులమైపోయాం. ఎందుకంటే అందులో కెఫిన్ అనే పదార్థం ఉండటంతో దానికి మొగ్గు చూపుతున్నాం. అంబలి తాగడంతో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయనే విషయం తెలిసినా పట్టించుకోవడం లేదు.
గుండెపోటు ముప్పు రాకుండా ఉండాలంటే వాకింగ్ చేయాలి. యోగా అలవాటుగా మార్చుకోవాలి. సమయం ప్రకారం ఆహారం తీసుకునేలా చూసుకోవాలి. చిరు ధాన్యాలు తినడం వల్ల మన ఆరోగ్యం అదుపులో ఉంటుంది. సైడ్ ఎఫెక్స్ట్స్ కూడా దరిచేరవు. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల నుంచి తప్పించుకునేందుకు మన అలవాట్లు మార్చుకోవాలి. మంచి ఆహారాలు తీసుకుని వ్యాధులు దరిచేరకుండా చేసుకోవాలి. అన్నంకు బదులుగా ధాన్యాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

వైట్ ప్రొడక్ట్స్ వల్ల మనకు దీర్ఘకాల నష్టాలు సంభవిస్తున్నాయి. డయాబెటిస్ కు చిరునామాగా మన తెలుగు రాష్ట్రాలు నిలుస్తున్నాయి. దీంతో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆహార అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకుని అన్నానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. చిరుధాన్యాలు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలుసుకుని వాటిని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించుకోవాలి.
