Generic Medicines: ఆసుపత్రికి వెళ్లినప్పుడు డాక్టర్స్ రాసే స్క్రిప్ట్ మనకు అస్సలు అర్థం కాదు. కానీ మెడికల్ షాపు వాళ్లు చూడగానే వెంటనే అర్థం చేసుకొని మెడిసిన్స్ మనముందు ఉంచుతారు. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే ఒక డాక్టర్ రాసిన స్క్రిప్ట్ ఆ ఆసుపత్రికి సంబంధించిన మెడికల్ షాపు వారికి మాత్రమే అర్థమవుతుంది..అందులోనే మెడిసిన్స్ ఉంటాయి.. ఇదంతా చూసి మనం డాక్టర్ల స్క్రిప్టు ఇలాగే ఉంటుందని అనుకుంటాం. కానీ ఇందులో మ్యాజిక్ ఉందని కొన్ని పరిశీనల ద్వారా తెలుస్తోంది. కొన్ని బ్రాండెడ్లకు సంబంధించిన మెడిసిన్స్ తమ మెడికల్ షాపులోనే కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో చాలా మంది వైద్యులు ఇలా చేస్తున్నారు. దీనిపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)ఫోకస్ పెట్టింది. ఇక నుంచి డాక్టర్లు మెడిసిన్స్ ను ప్రింట్ ద్వారా ఇవ్వాలని, అంతేకాకుండా జనరిక్ మెడిసిన్స్ కచ్చితంగా రాయాలని తెలిపింది. అలా చేయని పక్షంలో డాక్టర్ల లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే డాక్టర్లు ఇలాంటి స్క్రిప్టును ఎందుకు ఉపయోగిస్తున్నారు? అనే విషయంలోకి వెళితే..
కొన్ని మెడిసిన్స్ కంపెనీల ప్రతినిధులు ప్రత్యేకంగా వైద్యులను కలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా తమ కంపెనీకి సంబంధించిన మెడిసిన్స్ రాయాలని వారు తమ ప్రొడక్ట్ గురించి వివరిస్తారు. అయితే ఇందులో పోటీ పడి పలు కంపెనీలు డాక్టర్లను రెఫర్ చేస్తాయి. ఇందులో కొందరు డాక్టర్లను మచ్చిక కూడా చేసుకునే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఈ సమయంలో వైద్యలు కనుక మెడిసిన్ కంపెనీకి లొంగినట్లయితే వాటికి సంబంధించినవే రాస్తారు. అంతేకాకుండా ఈ మెడిసిన్స్ ఆ టౌన్ కు సంబంధించి ఇతర మెడికల్ షాపుల్లో దొరకకుండా ఫలానా మెడికల్ షాపుల్లో మాత్రమే అందుబాటులో ఉంచుతారు. ఇలా ఇష్టం వచ్చినట్లు మెడిసిన్స్ పై రోగుల నుంచి డబ్బులు అధికంగా వసూలు చేస్తారని కొందరు అంటున్నారు.
వాస్తవానికి మెడిసిన్ ను అందరూ ఒకటే వాడుతారని, కానీ కంపెనీలు కొన్ని మార్చి తమ పేరు పెట్టి ప్రచారం చేసుకుంటాయని మెడికల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇలా తమ కంపెనీ ప్రొడక్ట్ వాడితే బెటరనే స్థితికి తీసుకొస్తాయి. ఇలా రోగులు వాటికి అడిక్ట్ అయిన తరువాత రేట్లు పెంచుతూ అధికంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ఎన్నో రోజులుగా కంప్లయింట్లు ఉన్నాయి. డాక్టర్స్ స్క్రిప్ట్ అర్థమయ్యేలా లేదని కొందరు గతంలో సోషల్ మీడియాలో చర్చలు పెట్టారు. దీనిని గమనించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఫోకస్ పెట్టింది. 2002లోనే భారత వైద్య మండలి కొన్ని రూల్స్ జారీ చేసి డాక్టర్లు జనరిక్ మందులనే ప్రిస్క్రిప్షన్ లో రాయాలని చెప్పింది. కానీ దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు.
అయితే తాజాగా కేంద్రం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. నేషనల్ మెడికల్ కమిషన్ రిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ పేరుతో కొత్త రూల్స్ జారీ చేసింది. ఈ నిబంధన ప్రకారం వైద్యులు ఇకపై తమ వద్దకు వచ్చే రోగులకు జనరిక్ మందులనే రాయాలని ఆదేశించింది. అలా రాయని వైద్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరమైతే తాత్కాలికంగా లైసెన్స్ ను రద్దు చేస్తామని పేర్కొంది. వైద్యలు జనరిక్ మందులను రాస్తే రోగులకు చాలా వరకు డబ్బులు సేఫ్ అవుతాయి. బ్రాండెడ్ కంపెనీల మందులతో పోలిస్తే జనరిక్ మెడిసిన్స్ 30 నుంచి 80 శాతం తక్కువకే లభిస్తాయి. కానీ కొందరు వైద్యులు జనరిక్ మెడిసిన్స్ రాయడం వల్ల తమకు ఎలాంటి లాభం ఉండదనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే తాజాగా ఎన్ఎంసీ జారీ చేసిన నిబంధనలతోనైనా మారుతారా? లేదా? చూడాలి.