
Pawan Kalyan- Bandla Ganesh: బండ్ల గణేష్ అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్..ఆయన నామస్మరణ చేస్తూ పవన్ కళ్యాణ్ భక్తుడిగా బండ్ల గణేష్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ స్పీచ్ కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తారు. అలా పవన్ కళ్యాణ్ భక్తుడిగా ప్రాచుర్యం చెందిన బండ్ల గణేష్ ఇటీవల కాలం లో పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉంటూ వస్తున్నాడు.
అంతే కాదు అప్పుడప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ గురించి పరోక్షంగా ట్విట్టర్ లో ఎన్నో సెటైర్ల తో కూడిన ట్వీట్స్ వేసాడు. కానీ ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం దయచేసి ఇలా మాట్లాడొద్దు, పవన్ కళ్యాణ్ అన్నయ్య ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడల్లా మా రోమాలు నిక్కపొడుస్తాయి, దయచేసి అన్నయ్య కి దూరం అవ్వొద్దు అంటూ బండ్ల గణేష్ ని ట్యాగ్ చేసి ట్యాగ్ ఫ్యాన్స్ అడుగుతూ ఉంటారు.

అయితే రీసెంట్ గానే ట్విట్టర్ లో దీనిపై బండ్ల గణేష్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘మన దేవుడు (పవన్ కళ్యాణ్ ) మంచోడే అమ్మా, కానీ పక్కనే డాలర్ శేషాద్రి ఉన్నాడు. ఏమి చెయ్యగలం ఇక’ అంటూ చెప్పుకొచ్చాడు.’భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బండ్ల గణేష్ ని ఆహ్వనించొద్దు అంటూ త్రివిక్రమ్ మూవీ టీం కి అప్పట్లో స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడట.ఒక పవన్ కళ్యాణ్ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడిన ఫోన్ కాల్ ద్వారా రికార్డింగ్ ద్వారా ఈ విషయం తెలిసింది.
అప్పట్లో ఈ ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాంటాక్ట్స్ మొత్తాన్ని త్రివిక్రమ్ మైంటైన్ చేస్తున్నాడని, పవన్ కళ్యాణ్ ని కలవాలన్నా ముందుగా త్రివిక్రమ్ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ బండ్ల గణేష్ అనేక సందర్భాలలో ఆరోపించాడు.ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన చేసిన ‘డాలర్ శేషాద్రి’ కామెంట్స్ కూడా త్రివిక్రమ్ ని దృష్టిలో పెట్టుకొని చేసిన కామెంట్స్.