Homeట్రెండింగ్ న్యూస్Hidimbi : భీముడి భార్య ఎవరు.. మహాభారత యుద్ధం తర్వాత ఆమె ఏమైంది.. రాక్షస వంశంలో...

Hidimbi : భీముడి భార్య ఎవరు.. మహాభారత యుద్ధం తర్వాత ఆమె ఏమైంది.. రాక్షస వంశంలో పుట్టి.. దేవత ఎలా అయిందో తెలుసా? 

Hidimbi : మహాభారతంలో పాండవులు, కౌరవులు గురించే చాలా మంది చెబుతుంటారు. ఇందులో శ్రీకృష్ణుని పాత్ర కీలకం. మహాభారతం విన్నా.. చూసినా.. చదివినా కొత్త జ్ఞానం కలుగుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా కొత్త అంశం మన మదిని స్పృశిస్తుంది. ఇందులోని ప్రతీఒక్కరూ.. ఒక్కో పాత్ర కలిగి ఉన్నారు. కథను ముందుకు తీసుకోవడంలో ఎవరి పాత్ర వారిదే. అయితే మహాభారంతో పురుషులతో సమానంగా కొందరు స్త్రీలు కూడా కీలకంగా వ్యవహించారు. ప్రత్యక్షంగా యుద్ధం చేయకపోయినా.. యుద్ధ భాగస్వామ్యం మాత్రం ఏ యోధుడికీ తీసిపోదు. మహాభారత యుద్ధానికి ముందు కుంతి.. కర్ణుడిని కలిసి అతడి జన్మ రహస్యం చెప్పి అతడిని ఇరకాటంలో పడేసింది. గాం«ధారి తన కళ్ల గంతలు తొలగించి.. అతని శరీరాన్ని వజ్ర కవచంలా మార్చేసింది. ద్రౌపది తనకు జరిగిన అవమానానికి బదులుగా దుశ్యాసనుడి రక్తంతో తన కురులు తడపాలని కోరడం.. అభిమన్యుడి భార్య ఉత్తర అతడిని పద్మవ్యూహం ఛేదించుకు రావాలని సూచించడం.. శికండి రూపంలో అంబి.. యోధుడైన భీష్ముడి మరణానికి కారణం అయింది. ఇలా ఎందరో మహిళలు మహాభారత యుద్ధాన్ని ప్రభావింత చేశారు. యుద్ధ ఫలితంలో సంబంధం లేని మహిళ హిడింబి. రాక్షస వంశంలో పుట్టి భీముడిని పెళ్లాడిన హిడింబి పాండవుల క్షేమమే కోరుకుంది. ఎన్నడూ పాడవుల్లోని ఇతర మహిళలతో సమానంగా రాజభోగాలు కావాలని కోరుకోలేదు. పాండవుల్లో ద్వితీయుడైన భీముడి భార్యగా సాధారణ మహిళగా జీవనం సాగించింది. ధర్మం గెలవాలని కోరుకున్న ధీర వనిత. భార్యగా భీముడి మేలు.. పాడవుల క్షేమం కోరుకుంది.

తన అన్నను చంపిన భీముడినే పెళ్లాడి.. 
రాక్షస స్త్రీ అయిన హిడింబి తన అన్న హిడింబాసురుడిని చంపిన భీముడిని వరించి పెళ్లి చేసుకుంది. జీవితాంతం పాడవుల క్షేమం కోరుకుంది. రాక్షస లక్షణాలన్నీ వదిలించుకుని సాత్విక మహిళగా జీవితం గడిపింది. ఈ ప్రయత్నంలో తన జాతికి పూర్తిగా దూరమైంది. అలాగని రాజవిలాసాలను అనుభవించానుకోలేదు.
కొడుకును శక్తివంతుడిగా తీర్చిదిద్ది..
ఇక హిడింబి, భీముడి దంపతులకు పుట్టిన కుమారుడు ఘటోత్కచుడు. అతడిని మహాశక్తివంతుడిగా తీర్చిదిద్దడంలో హిడింబి పాత్ర కాదనలేనిది. తండ్రికి తగ్గ తనయుడిగా ఘటోత్కచుడిని శక్తివంతుడిని చేసింది. అస్త్ర, శస్త్ర విద్యల్లో గొప్పవాడిని చేసింది. కష్టాల్లో ఉన్నప్పుడు పాండవులను కలిసిన హిడింబి ఏనాడైనా యుద్ధం జరిగితే వారికి సమానమైన శక్తి కలిగిన కుమారుడిని అందించాలని నిర్ణయించుకుంది. అందుకు తగినట్లుగా ఘటోత్కచుడిని పెంచింది. పాండవులతో సమానంగా పోరాడగల నైపుణ్యంలో శిక్షణ ఇప్పించింది.
తల్లి ఆశల్ని వమ్ము చేయని ఘటోత్కచుడు..
ఇక ఘటోత్కచుడు కూడా ఏనాడూ తల్లి హిడింబి ఆశలను వమ్ము చేయలేదు. ఆమె కోరుకున్నట్లు మహా బలశాలి, బుద్ధిశాలిగా ఎదిగాడు. భీముడు, హిడింబి లాగానే ఘటోత్కచుడు కూడా ఏనాడు తమకు రాజభోగాలు కావాలనుకోలేదు. ఇందులో తల్లి పాత్రే చాలా కీలకం. రాజకుమారులకు ఏమాత్రం తీసిపోనివిధంగా ఎదిగాడు ఘటోత్కచుడు.
రాక్షస కన్యతో వివాహం.. 
ఐలావతి అనే రాక్షస కన్యతో ఘటోత్కచుడికి వివాహం జరిపించింది. హిడింబి. ఆమె మరోపేరు మౌర్య. ఈమే మురా అనేరాక్షసుడి కూతురు. ఘటోత్కచుడు, ఐలావతిల పెద్దకుమారుడు బర్బరీకుడు. ఇతడు కూడా మహా వీరుడు. ఎప్పుడూ ఓడిపోయిన వారి పక్షాన ఉండాలని తల్లి ఆదేశం. బర్బరీకుడికి మూడు వరాలు కూడా ఉన్నాయి. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలుసు. కానీ బర్బరీయుడు యుద్ధంలో పాల్గొనకుండా మాయోపాయంతో యుద్ధానికి ముందు రణచండీకుడికి బలిస్తాడు. తర్వాత శ్రీకృష్ణుడి వరంతో బర్బరీకుడి ఖండిత శిరస్సు ఓ ఎత్తయిన ప్రదేశం నుంచి మహాభారత యుద్ధాన్ని చూస్తుంది. యుద్ధం ముగిసిన తర్వాత బర్బరీకుడి శిరస్సుకు పూజార్హత వరమిస్తాడు శ్రీకృష్ణుడు.
రాజస్థాన్‌లో శిరస్సు ఆలయం.. 
నాటి వరం తోనే బర్బరీకుడికి రాజస్థాన్‌లోని ఘటుశ్యాం ఆలయంలో పూజలు అందుకుంటున్న ఘటుశ్యాం బాబా. నేటికీ ఈ ఆలయంలో శిరస్సుకు మాత్రమే పూజలు జరుగుతుంటాయి. భారీగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ఇలా యుద్ధానికి ముందే మనుమడుని కోల్పోయింది హిడింబి. రెండో మనుమడు అంజన పర్వుడు కూడా యుద్ధం 14వ రోజు పాండవుల పక్షాన పోరాడుతూ అశ్వద్ధామ చేతిలో మరణిస్తాడు. కౌరవ సేనను ముప్పు తిప్పలు పెట్టిన అంజనపర్వుడు తర్వాత అశ్వద్ధామను చుట్టుముట్టి చికాకుపెడతాడు. అశ్వద్ధామ బాణం ధాటికి అంజనపర్వుడు మరణిస్తాడు.
రణరంగంలోకి ఘటోత్కచుడు.. 
పుత్రశోకంతో బాధపడిన ఘటోత్కచుడి నేరుగా యుద్ధరంగంలోకి దిగాడు. అశ్వద్ధామపై దాడిచేస్తాడు. తీవ్రంగా గాయపడతాడు. తర్వాత శ్రీకృష్ణుడి సలహాతో కర్ణుడితో తలపడతాడు. ఒకరి ఆయుధాన్ని ఒకరు నిర్వీర్యం చేసుకుంటూ పోరాడారు. చివరకు కర్ణుడు ధుర్యోధనుడి ప్రోద్బలంలో ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించాడు. వాస్తవానికి ఈ ఆయుధాన్ని అర్జునుడిపై ప్రయోగించేందుకు వరం పొందాడు. ఇది ఒక్కసారి మాత్రమే ప్రయోగించే వీలుంది. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు అర్జునుడికి అడ్డు తొలగించుకునేందుకు ఘటోత్కచుడిని కర్ణుడిపై ఉసికొల్పి శక్తి అస్త్రం ప్రయోగించేలా చేశాడు. శక్తి అస్త్ర ప్రయోగంతో ఘటోత్కచుడు యుద్ధంలో మరణిస్తాడు. ఆ శక్తిని ఉపయోగించకపోతే ఘటోత్కచుడు యుద్ధం ముగించేవాడు క్రెడిట్‌ ఘటోత్కచుడికే వెళ్లేంది కూడా. కానీ తన పినతండ్రి కోసం తన ప్రాణాలు బలి ఇచ్చిన వీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు.
కొడుకు, మనుమడిని కోల్పోయిన హిడింబి.. 
అర్జునుడికి అడ్డంకులు తొలగిపోవడం అంటే పాండవుల విజయానికి బాటలు వేసినట్లే. ఇలా ధర్మం కోసం హిడింబి తన కొడుకు, మనుమడిని ఒకే రోజు యుద్ధరంగానికి సమర్పించింది. ఇలా హిడింబి త్యాగం మహాభారతంలో అందరికంటే గొప్పగా నిలిచింది.
దేవతా వరం ఇచ్చిన శ్రీకృష్ణుడు.. 
యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు హిడింబిని కలుస్తాడు. కొడుకు, మనుమడి మరణానికి చింతిస్తాడు. హిడింబి యుద్ధాన్ని నిలువరించే శక్తి ఉన్నా.. యుద్ధం జరిగేలా ప్రోత్సహించిన శ్రీకృష్ణుడిని హిడింబి పల్లెత్తు మాట కూడా అనలేదు. దీనిని గుర్తించిన కృష్ణుడు హిడింబి త్యాగానికి గర్విస్తున్నానని అన్నాడు. ఈ సందర్భంగా హిడింబిని దేవతగా సంబోధించాడు. ఆ తర్వాత తపస్సుకు వెళ్లిన హిడింబి శ్రీకృష్ణుడి వరంతో దేవతగా నిలిచింది. ఇప్పటికీ ఘటోత్కచుడి వారసత్వం కొనసాగుతోంది. వారు హిడింబిని తమ దేవతగా కొలుస్తారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఆలయం..
భీముని భార్య హిడింబికి హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలిలో హిడింబాదేవి ఆలయం ఉంది. లోపల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శిల ఉంది. దానినే హిడింబాదేవిగా ఘటోత్కచుడి వారసులు పూజిస్తారు. స్థానిక భాషలో ఆ రాయిని డోంగ్‌ అంటారు. డోంగ్రీ దేవిగా హిడింబిని కొలుస్తారు. కుల్‌ రాజవంశస్తులు హిడింబి దేవికి ఆలయం నిర్మించారు. పగోడా శైలిలో ఆలయం ఎత్తయిన దేవదారు వృక్షాల నడుమ ఎంతో మనోహరంగా ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ జంతు బలులు ఇచ్చేవారు. ఇప్పుడు నిషేధించారు.
రాక్షస స్త్రీగా జన్మించిన హిడింబి సామాన్య మహిళగా జీవనం సాగించింది. చివరకు దేవతగా పూజలు అందుకుంటోంది.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular