పూరి స్పీడుకు బ్రేక్ వేసిందెవరు?

టాలీవుడ్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్మాథ్ కు మంచి గుర్తింపు ఉంది. పూరి తన సినిమాలతోనే కాకుండా తన డైలాగ్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఇటీవల సోషల్ మీడియాలో పూరి మ్యూజింగ్స్ అంటూ హల్చల్ చేస్తున్న సంగతి తెల్సిందే..! Also Read: ‘ఆచార్య’.. ‘రాధేశ్యామ్’ మరింత ఆలస్యం.. కారణమేంటి? పూరి జగన్మాథ్ ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమాకు సిక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తీస్తానని గతంలోనే పూరి […]

Written By: NARESH, Updated On : November 27, 2020 7:36 pm
Follow us on

టాలీవుడ్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్మాథ్ కు మంచి గుర్తింపు ఉంది. పూరి తన సినిమాలతోనే కాకుండా తన డైలాగ్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఇటీవల సోషల్ మీడియాలో పూరి మ్యూజింగ్స్ అంటూ హల్చల్ చేస్తున్న సంగతి తెల్సిందే..!

Also Read: ‘ఆచార్య’.. ‘రాధేశ్యామ్’ మరింత ఆలస్యం.. కారణమేంటి?

పూరి జగన్మాథ్ ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమాకు సిక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తీస్తానని గతంలోనే పూరి జగన్మాథ్ ప్రకటించాడు. అయితే ఈ మూవీ కంటే ముందుగా విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ మూవీని స్టాట్ చేశాడు.

ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తోంది. ‘ఫైటర్’ మూవీని పూరి జగన్మాథ్-చార్మితో కలిసి తెలుగులో నిర్మిస్తున్నాడు. హిందీలో మాత్రం కరుణ్ జోహర్ నిర్మిస్తున్నాడు. అయితే కరణ్ జోహర్ కు హిందీలో చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి

Also Read: ఆ హీరో పెళ్లిళ్లు పై మంచు లక్ష్మి కన్నీళ్లు !

ఈక్రమంలోనే కరణ్ జోహర్ ప్రియారిటీ ప్రకారంగా సినిమాలను పూర్తి చేస్తుంటాడు. ‘ఫైటర్’ మూవీ చాలా షూటింగు జరుపుకోవాల్సి ఉంటుండటంతో కరణ్ జోహార్ ప్రస్తుతం ఈ మూవీని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పూరి జగన్మాథ్ మరో సినిమా మొదలు పెట్టాక కొంతకాలంగా వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మాములుగా అయితే పూరి జగన్మాథ్ సినిమాలన్నీ జెట్ స్పీడుతో పూర్తవుతుంటాయి. నాలుగైదు నెలల్లో సినిమాలను పూర్తి చేయడం పూరి స్టైల్. అయితే కరోనా ఎఫెక్ట్ తో సినిమా వాయిదాపడింది. అయితే ప్రస్తుతం షూటింగులు మొదలైనప్పటికీ పూరి సినిమా మాత్రం ప్రారంభం కావడంలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

ఈ సినిమాకు కరణ్ జోహర్ ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో పూరి సినిమాను ప్రారంభించలేదని తెలుస్తోంది. ‘ఫైటర్’ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుందా? అని అభిమానులు మాత్రం అత్రుతగా ఎదురు చూస్తున్నారు.