Homeఆంధ్రప్రదేశ్‌AP Early Elections: ముందస్తు ఎన్నికలకు వెళితే ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది?

AP Early Elections: ముందస్తు ఎన్నికలకు వెళితే ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది?

AP Early Elections
AP Early Elections

AP Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికల అంటూ చాలా కాలంగా వినిపిస్తున్న మాట. అసలు ఎందుకు ముందస్తు ఎన్నికలు వస్తాయని లాజికల్ గా ఆలోచిస్తే జవాబు మాత్రం ఉండదు. ఉదాహరణకు వైసిపి ముందస్తు ఎన్నికలకు వెళ్లిందనుకుంటే అది పూర్తిగా ఆ ప్రభుత్వం వైఫల్యంగా ముందే చెప్పుకొని ఒప్పుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఆ పార్టీకి ప్రజలు 151 సీట్లతో భారీ మెజారిటీని ఇచ్చారు. ఐదేళ్లు ఏ చిక్కులు చికాకులు లేకుండా పాలించమని స్పష్టంగా చెప్పారు. అలాంటిది ఏడాది అధికారం ఉండగానే వదిలేసుకుని వైసీపీ ఎన్నికలకు సిద్ధపడటం రాజకీయంగా ఎంతవరకు కరెక్ట్ వ్యూహమో తెలియదు కానీ.. జనాల వైపు నుంచి చూస్తే వారు దానిని తోసిపుచ్చుతారని అంటున్నారు. ప్రతిపక్షాలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా లేవన్నది స్పష్టంగా అర్థమవుతుంది. టిడిపి, జనసేన పొత్తులు తేలకపోవడం.. జనసేన ఇంకా పార్టీని బలోపేతం చేయకపోవడం, టిడిపిలో అంతర్గత పోరు వంటి ఇబ్బందికరమైన అంశాలు ఆయా పార్టీలను ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా లేకుండా చేస్తున్నాయి.

వైసిపికి ప్రజల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశం..

ఐదేళ్లపాటు పాలించమని ప్రజలు అధికారాన్ని ఇచ్చినప్పుడు.. ఆ ఐదేళ్లు పాలించలేని వారు మళ్లీ అధికారం కోసం ఎలా అడుగుతారు అని విపక్షాలు నుంచి ప్రశ్నలు వస్తాయి. జనాలు కూడా ఆ విధంగానే ఆలోచిస్తారు. ముందస్తు ఎన్నికలు ఈ మధ్య హడావుడి మొదలవుగానే సోషల్ మీడియాలో వైసీపీకి యాంటీగా పోస్టింగులు పడ్డాయి. 30 ఏళ్ల అధికారం అంటున్న వారు నాలుగేళ్లకే జారిపోతున్నారు అని సెటైరికల్ గా పోస్టులు పెట్టారు. జనంలోనూ ఇదే రకమైన అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వలన.. ఏమైనా అదనపు ఉపయోగం ఉంటుందా అన్నది వైసిపి ఆలోచన. నిజానికి ముందస్తు ఎన్నికల కంటే మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం వలన ఉపయోగం ఉంటుందని వైసీపీ భావిస్తూ ఉండవచ్చు.

మధ్యంతర ఎన్నికలకు వెళ్ళిన సందర్భాలు కొన్ని..

మధ్యంతర ఎన్నికలు అంటే సగం పాలన తరువాత అన్నమాట. 1983లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చి.. నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుతో 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. దానికి ఆయనకు బలమైన కారణం ఉంది. అలాగే కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలకు వెళ్ళింది. ఇలా బలమైన కారణాలు ఉంటే అవి వర్క్ అవుట్ అవుతాయి.

ప్రజల మూడ్ లో మార్పు ఉండకపోవచ్చు..

నాలుగేళ్ల పాటు పాలించి చివరి ఏడాది అయినా ఆరు నెలలు ముందు అయినా ఎన్నికలకు వెళ్లిన జనాల మూడు లో ఏమీ మార్పు ఉండదు. తెలంగాణలోనూ అదే జరిగింది. 2018లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ పొత్తును బూచిగా చూపించి చివరి నిమిషంలో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడంతో అది పాలించి ఆయన సీఎం కాగలరు. ఏపీలో అయితే ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. జగన్ సర్కార్ నాలుగేళ్ల కాలంలో కేవలం సంక్షేమం మీదనే దృష్టి సారించింది. అభివృద్ధి అన్నది లేదు. దానికి రెండేళ్ల కరోనా అని వారు కారణం చెప్పినా కూడా జనాలు వద్ద అది తేలిపోతోంది. ఇక కొన్ని హామీలు అలాగే ఉన్నాయి. దీంతో చివరి ఏడాదిలో ఏమైనా మెరుపులు మెరూపించి ఎన్నికలకు వెళ్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అన్నది వైసీపీ ప్రభుత్వ ఆశగా కనిపిస్తోంది. అంతేగాని ఇప్పుడు ఏమీ లేకుండా ఎన్నికలకు వెళ్తే జనాలు యాంటీగా ఉంటే బంగారం లాంటి ఏడాది కాలం అధికారం కూడా పోగొట్టుకున్నట్లు అవుతుందని వైసీపీ భావిస్తోంది.

అత్యంత కీలకంగా చివరి ఏడాది..

ఏది ఏమైనా వైసీపీకి చివరి ఏడాది చాలా ముఖ్యమైనదిగా కనిపిస్తోంది. అందుకే వ్యూహాలు, పాలనలో కొత్త పుంతలు తొక్కడాలన్నింటికీ రెడీ అవ్వడానికి వైసీపీ చూస్తోంది. సో వైసిపి యాంగిల్ లో చూస్తే ముందస్తు ఎన్నికలకు రెడీగా లేదనే చెప్పాలి. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా దానిపై స్పష్టత ఇచ్చారు. ఇక విపక్షం వైపు నుంచి చూస్తే టిడిపి నాలుగు ఎమ్మెల్సీ ఎన్నికలను గెలిచిన తర్వాత కొంత నిబ్బరంగా కనిపిస్తున్న అది పూర్తిగా నిజం కాదు. ఆ పార్టీ భయాలు అలాగే ఉన్నాయి. ఒకవైపు పొత్తులు కథ తేలడం లేదు. ఒంటరిగా పోవాలో.. జంటగా వెళ్ళాలో తెలియక.. ఆ పార్టీ సతమతమవుతోంది. టికెట్లు పోరు కూడా అలానే ఉంది. జూనియర్లు వర్సెస్ సీనియర్లుగా పరిస్థితి నడుస్తోంది. ఈ నేపథ్యంలో టిడిపి కూడా ముందస్తు అంటే రెడీగా లేదనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి మరింత సమయం కావాల్సి ఉందని చెబుతున్నారు.

రెండు నెలల సమయం అత్యంత కీలకం..

వైసిపి మీద పూర్తిస్థాయిలో వ్యతిరేకత గూడు కట్టడానికి ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు సమయం మాత్రం కీలకం. కాబట్టి ఈలోగా ఎన్నికలు అంటే తేడా కొడితే మరో ఐదేళ్లు టిడిపి విపక్షంలో కూర్చోవాలి. అదేవిధంగా జనసేన సంగతి తీసుకున్న అధినాయకుడు ఇంకా వారాహి రథం ఎక్కలేదు. ఈసారి ఎన్నికలు ఆ పార్టీకి అగ్నిపరీక్ష లాంటివి. పైగా పొత్తులు గౌరవప్రదంగా కుదరాలి. లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఇలా చాలా రకాలైన సమస్యలు పరిష్కరించుకోవాలి. సో జనసేన కూడా 2024లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితేనే మేలు అన్న భావన ఉంది. మొత్తానికి అన్ని రాజకీయ పార్టీలు ముందస్తుకు రెడీ అని అంటున్నా.. ఎవరూ కూడా ఇంకా ఇల్లు సర్దుకోలేదు అన్నది అర్థమవుతుంది. ఇక జనాలు ఎన్నికలు మూడ్లో లేరు. టోటల్ గా ముందస్తు అనుకుంటూ రాజకీయ పార్టీలు భారీ డైలాగులు వల్లించడం తప్ప అయ్యేది కాదు పోయేది కాదు అని పలువురు పేర్కొంటున్నారు.

AP Early Elections
AP Early Elections

పొత్తు పెట్టుకుంటే కూటమిదే విజయం..

ముందస్తు ఎన్నికలకు ఇండివిడ్యువల్ గా మూడు పార్టీలు వెళితే ఏ పార్టీకి ఉపయోగంగా ఉండదన్నది ఇప్పటికిప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి చెప్పలేకపోవచ్చు. కానీ జనసేన టిడిపి పొత్తుతో ఎన్నికలకు వెళ్తే మాత్రం కూటమి విజయం సాధించేందుకు అనుగుణంగా పరిస్థితులు ఉన్నాయన్నది స్పష్టంగా తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునివ్వగా.. ఆ పార్టీ ఓటు మొత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బదిలీ అయింది. దీంతో మూడు చోట్ల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. ఇదే తరహాలో ముందస్తు ఎన్నికలకు గాని, 2024 ఎన్నికలకు గాని జనసేన – టిడిపి కూటమిగా ఎన్నికలకు వెళితే విజయం సాధించే అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నట్లు నిధులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పై పెరిగిన అసంతృప్తి, వ్యతిరేకత ప్రతిపక్షాల కూటమికి విజయాన్ని చేకూరుస్తాయి అన్న భావన సర్వత్ర వ్యక్తం అవుతోంది.

Exit mobile version