Bigg Boss 6 Telugu Geetu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఈ మధ్య కాలం లో ఎన్నో ఊహించని ఎలిమినేషన్స్ జరిగాయి.. అలాంటి ఎలిమినేషన్స్ లో ఒకటి గీతూ ఎలిమినేషన్.. ఇలా కూడా ఆడుతారా ఒక ఆట అని హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎన్నోసార్లు అనిపించేలా చేసిన ఈమె తెలివితో ఆడుతున్న అనుకుంది కానీ.. అది జనాల్లోకి ఎలా వెళ్తుందో ఊహించలేకపోయింది..తానె నెంబర్ 1 అనే అహకారం తో విర్రవీగిపోయింది..తానే బిగ్ బాస్ గేమ్స్ ని ఆడిస్తున్నట్టు చెప్పుకుంది..తన వల్లే ఈ సీజన్ బిగ్ బాస్ షో నడుస్తున్నట్టు బిల్డుప్స్ ఇచ్చుకుంది.

కానీ ప్రేక్షకులు చివరికి ఆమెకి టాప్ 10 స్థానం లో కూడా చోటు కల్పించలేదు..అందుకే ఏదైనా లిమిట్ లోనే ఉండాలి..లిమిట్ దాటితే ఎదుటివాడికి చిరాకు కలిగిస్తుంది అని పెద్దలు అనేది..నిన్న గీతూ విషయం లో కూడా జరిగింది అదే..చివరికి ఎలిమినేషన్ అయ్యేలోపు ఆమె ఎలా వెక్కిళ్లు పెట్టి ఏడ్చిందో మనం ఇప్పట్లో మరచిపోలేము..అహంకారం మొత్తం దిగిపొయ్యి తానూ చేసిన తప్పులు ఏమిటో తెలిసొచ్చాయి.
గీతూ హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో చాలా బాగా ఆడేది.. మొదటి మూడు వారాలు ఆమె ఆట భేష్ అనే చెప్పొచ్చు.. కానీ ఆ తర్వాత వారం నుండి తన ఆట తీరు మారిపోయింది..టాస్కులు ఆడడం కంటే అవతలి మనిషి బలహీనతలతో ఆడుకోవడమే ఆమె చేసిన అతి పెద్ద పొరపాటు..గేమ్ ఆడడం లో భాగంగా అవన్నీ సహజమే అనుకోవచ్చు..కానీ ఆడియన్స్ ఎప్పుడూ ఎమోషన్స్ కి మాత్రమే ఎక్కువ కనెక్ట్ అవుతారు..అది దృష్టిలో పెట్టుకొనే ఏ కంటెస్టెంట్ అయినా ఆడాలి.
గీతూ అలా ఆడకపోవడం వల్లే టాప్ 5లో ఉండగలిగే సత్తా ఉన్న కంటెస్టెంట్ నుండి టాప్ 10 లో కూడా స్థానం దక్కని కంటెస్టెంట్ గా మిగిలిపోయింది.. అప్పటికి ఆమె కంటెంట్ బాగా ఇస్తూనే వస్తుంది కాబట్టి ఆమెని అభిమానించే వారు నామినేషన్స్ నుండి సేవ్ చేస్తూ వచ్చారు..కానీ పోయినవారం ఆమె ఆడిన ఆట అందరికి నషాళానికి అంటే రేంజ్ లో కోపం రప్పించింది..తన గేమ్ ని చెడుపుకోవడమే కాకుండా..తన టీం లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరి గేమ్ ని చెడగొట్టింది.
బయట చూసే జనాలకు వాళ్ళు కూడా నెగటివ్ అయ్యే రేంజ్ కి తీసుకొచ్చింది..ఆది రెడ్డి ని మోసం చెయ్యడం..బాలాదిత్య బలహీనతతో ఆదుకోవడం ఆమె ఎలిమినేట్ అవ్వడానికి ముఖ్య కారణాలు..ఎప్పుడూ టాప్ లో ఉండే శ్రీ సత్య ఈ వారం డేంజర్ జోన్ వరుకు రావడానికి కారణం కూడా గీతూ అనే అంటారు నెటిజెన్స్..ఇలా గీతూ తన కన్నింగ్ స్ట్రాటజిలతో గేమ్ ని ఆడి ఇంత తొందరగా బయటకి వచ్చేసింది.