Bigg Boss 6 Telugu Geetu : గత వారం జరిగిన బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్కు ఎంత వాడివేడిగా సాగిందో మన అందరికి తెలిసిందే..కంటెస్టెంట్స్ అందరూ కూడా హద్దులు దాటి ఆడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ముఖ్యంగా గీతూ గురుంచి మనం మాట్లాడుకోవాలి..టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా కచ్చితంగా ఉంటుంది అని అనుకున్న ఈమె అనుకోని విధంగా నిన్న ఎలిమినేట్ అవ్వడం హౌస్ మేట్స్ తో పాటుగా చూసే ప్రేక్షకులకు పెద్ద షాక్ ని ఇచ్చింది..ఆమె అలా అర్థాంతరంగా ఎలిమినేట్ అవ్వడానికి కారణం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ బలహీనతలతో ఆదుకోవడమే.

ముఖ్యంగా తనని హౌస్ లో చెల్లెలు గా చేరదీసి బాలాదిత్య బలహీనతతో ఆదుకోవడం, ఆది రెడ్డి ని మోసం చెయ్యడం ఎవ్వరికి నచ్చలేదు..ఆదిరెడ్డి అంత కస్టపడి ఆడినా కూడా గీతూ చేసిన చీప్ ట్రిక్ వల్ల టాస్కులో ఎలిమినేట్ అయ్యానే అని అతను ఎంతలాగ బాదపడ్డాడో మన అందరం చూసాము..గీతూ అంత దెబ్బతీసిన తర్వాత ఎవ్వరూ కూడా ఆమెతో స్నేహం చెయ్యడానికి సాహసించరు.
కానీ ఆదిరెడ్డి ఆమెని క్షమించి ఎప్పటిలాగానే ఉండే ప్రయత్నం చేసాడు..ఇంతమంచోడిని ఎలా బాధపెట్టాలనిపించింది అని ప్రేక్షకులు తిట్టుకునేలా చేసింది గీతూ..అందుకే ఆమె మద్దతుదారులు కూడా ఆమెకి వోట్ వెయ్యడం ఆపేసారు..ఇక టాస్కులో గీతూ అంత మోసం చేసిన తర్వాత ఆది రెడ్డి ‘ఎదో ఒక రోజు నిన్ను వెక్కిళ్లు పెట్టి ఏడ్చేలా చెయ్యకపోతే నాపేరు ఆదిరెడ్డి కాదు’ అని ఛాలెంజ్ చేస్తాడు..’నీ వల్ల అయితే ట్రై చేసుకో’ అంటూ గీతూ బదులిస్తుంది..చివరికి ఆదిరెడ్డి చెప్పినట్టుగానే రెండు రోజులు కూడా తిరగకముందే గీతూ ని వెక్కిళ్లు పెట్టి ఏడ్చేలా చేసాడు.
హౌస్ లో నుండి బయటకి వెళ్లేవరకూ ఆమె ఏడుస్తూనే ఉన్నింది..ఎంతలా ఏడ్చింది అంటే ఆమెని ద్వేషించేవాళ్ళు కూడా ‘అయ్యో..పాపం’ అనిపించే రేంజ్ లో ఏడ్చేసింది..ఆదిరెడ్డి అన్నట్టుగానే జరిగిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ పోస్ట్స్ పెడుతున్నారు..ఇదంతా పక్కన పెడితే గీతూ హౌస్ లో నుండి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రేపటి నుండి గేమ్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.