https://oktelugu.com/

కరోనాకు చెక్ పెడుతున్న మాస్కు ఇదేనట?

ప్రస్తుతం మనమంతా ఉన్నది కరోనా కాలంలో.. ఈకాలంలో ప్రతీఒక్కరికి అవసరమైనది ఏదైనా ఉందంటే ముందు వరుసలో నిలిచేది మాస్కు మాత్రమే. మాస్కులేకుండా కరోనా కాలంలో జీవించడమంటే కొరివితో తలగొక్కునట్టే.. మాస్కుతోపాటు ప్రతీఒక్కరు భౌతిక దూరం పాటించడం.. వీలైనంత వరకు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవడం.. తదితర కరోనా నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. Also Read: హైకోర్టు సాక్షిగా అమరావతి రైతులకి జగన్ బంపర్ ఆఫర్…? ఇప్పటికే రష్యా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టింది. అయితే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 15, 2020 / 11:47 AM IST
    Follow us on


    ప్రస్తుతం మనమంతా ఉన్నది కరోనా కాలంలో.. ఈకాలంలో ప్రతీఒక్కరికి అవసరమైనది ఏదైనా ఉందంటే ముందు వరుసలో నిలిచేది మాస్కు మాత్రమే. మాస్కులేకుండా కరోనా కాలంలో జీవించడమంటే కొరివితో తలగొక్కునట్టే.. మాస్కుతోపాటు ప్రతీఒక్కరు భౌతిక దూరం పాటించడం.. వీలైనంత వరకు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవడం.. తదితర కరోనా నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

    Also Read: హైకోర్టు సాక్షిగా అమరావతి రైతులకి జగన్ బంపర్ ఆఫర్…?

    ఇప్పటికే రష్యా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టింది. అయితే ఇది ఏమేరకు పని చేస్తుందనే సందేహాలు ప్రతీఒక్కరిలో ఉన్నాయి. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ఏడాదిపాటు పని చేస్తుందని ఆ దేశం ప్రకటించింది. ఈలోపు భారత్ లాంటి దేశాలు మేలైన కరోనా వ్యాక్సిన్లను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలున్నాయి. అయితే అప్పటివరకు ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరి. మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్న మాస్కుల్లో ఏది ఉత్తమమైన మాస్కు?.. ఏది కరోనా వైరస్ ను కట్టడి చేస్తుందని అనేక మందిలో సందేహాలు ఉన్నాయి.

    ఈ విషయంపై అమెరికా, నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన అధ్యాయనం చేసి ప్రస్తుత పరిస్థితుల్లో ఏది ఉత్తమమైన మాస్కో వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా లభ్యమవుతున్న 14రకాల మాస్కులపై అధ్యాయనం చేశారు.లేజర్ సెన్సర్ డివైజ్‌తో 14రకాల మాస్క్‌లను, ఫేస్ కవరింగ్స్‌ను పోల్చి చూశారు. మాస్క్ ధరించిన సమయంలో డ్రాప్‌లెట్స్ ఎలా అడ్డుకుంటున్నాయో పరిశీలించి.. ఏ మాస్కు కరోనా వైరస్ ను సమర్థవంతంగా అడ్డుకుంటుందో తేల్చిచెప్పారు.

    Also Read: కాంగ్రెస్ ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుందేంటి..? దెబ్బకి కేసీఆర్ వణికిపోయాడు

    14రకాల మాస్కుల్లో కరోనా(డ్రాప్‌లెట్స్)ను నిరోధించడంలో ఎన్-95 మాస్క్‌ ఉత్తమమని తేలిందట. కానీ ఎన్-95మాస్కులో వాల్వ్ లేనివి వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతోపాటు త్రీ లేయర్ మాస్క్.. కాటన్ పొలిప్రోలిన్ కాటన్ మాస్క్.. టూ లేయర్ పొలిప్రోలిన్ అప్రాన్ మాస్క్‌లు ఉత్తమమని చెబుతున్నారు. ఇక నెక్ గెటర్ మాస్క్ కరోనా వ్యాప్తికి సహకరించే నోటి తుంపర్లను అడ్డుకోవడం లేదని తేలిందట. వీటిని ధరించడం వల్ల రిస్క్ ఓ పదిశాతం ఎక్కువనని గుర్తించారు. ఈ మాస్కును వాడకపోవడంమే బెటరని అంటున్నారు.

    అయితే ఇటీవల పరిశోధనల్లో వాల్వ్‌లున్న ఎన్-95 మాస్క్‌లు తుంపర్లను అడ్డుకోవడంలో విఫమవుతున్నాయని తేలింది. దీంతో వాల్వ్ లేని ఎన్-95 మాస్కులను వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా కాలంలో మాస్కులు తప్పనిసరి కావడంతో ప్రతీఒక్కరు మాస్క్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అజాగ్రత్తగా ఉంటే మాస్కు ధరించిన ఉపయోగం ఉండదని హెచ్చరిస్తున్నారు.

    Tags